వెస్ట్ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీపై ఓ మహిళ ఆగ్రహంతో చెప్పు విసిరారు. ఇలాంటి నాయకులు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అతడిని తాళ్లతో కట్టి వీధుల్లోకి లాగాలని అన్నారు.
వెస్ట్ బెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి పార్థ ఛటర్జీపై ఓ మహిళ చెప్పు విసిరింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అర్పితా ముఖర్జీతో పాటు ఛటర్జీని వైద్య పరీక్షల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ ను మంగళవారం తీసుకెళ్లారు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మంకీపాక్స్ కొత్త వ్యాధి కాదు.. భయాందోళనలు వద్దు.. - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
చెప్పు విసిరిన అనంతరం ఆ మహిళా మీడియాతో మాట్లాడారు. ‘‘ అలాంటి నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే నేను నా చెప్పు విసిరాను ’’ అని ఆ మహిళ చెప్పింది. ‘‘ నేను మందులు కొనడానికి ఇక్కడకు వచ్చాను. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనడానికి అతడు పేదలను దోచుకున్నాడు. అతడిని తాళ్లతో కట్టి వీధుల్లోకి లాగాలి. నేను నా చెప్పులు లేకుండా ఇంటికి వెళ్తాను. ’’ అని ఆమె అన్నారు.
కాగా నిన్న కూడా ఛటర్జీని వైద్య పరీక్ష కోసం ఇదే హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ డబ్బు తనది కాదని అన్నారు. కావాలనే తనను కుట్ర పూరితంగా ఇరికించారని చెప్పారు. తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై కుట్ర చేసిన వారెవరో త్వరలో కాలమే చెబుతుందని అన్నారు. అయితే ఈరోజు ఆయనతో పాటు అర్పితా ముఖర్జీని కూడా హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు తెలియకుండానే తన ఇంట్లో డబ్బులను ఉంచారని అన్నారు.
రక్షణ, భద్రత రంగాల్లో భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శాంతికి కీలకం - ప్రధాని నరేంద్ర మోడీ
పశ్చిమ బెంగాల్లో ఎస్ఎస్ సీ నియామక కుంభకోణం కేసులో పార్థ, అర్పితలను ఆగస్టు ౩ వరకు ఈడీ కష్టడీకి పంపించారు. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ సిఫారసుల మేరకు నిర్వహించిన టీచర్ రిక్రూట్ మెంట్ తో పాటు, గ్రూప్-సీ, డీ సిబ్బంది నియామకాల్లో జరిగిన అవకతవకలపై కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరుపుతోంది. ఈ కుంభకోణంలో మనీ జాడపై ఈడీ ఆరా తీస్తోంది. అందులో భాగంగా ఆయనను ఇటీవలే అరెస్టు చేసింది. అలాగే ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఛటర్జీకి అత్యంత సన్నితుల్లో ఒకరైన అర్పితా ముఖర్జీకి చెందిన ఇళ్లల్లో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పితా ఫ్లాట్ల నుంచి దాదాపు రూ.50 కోట్లు రికవరీ కావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్థ ఛటర్జీని సస్పెండ్ చేసింది. మంత్రి పదవిని కూడా తొలగించింది.
