Asianet News TeluguAsianet News Telugu

WB SSC Scam : అర్పితా ముఖ‌ర్జీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌పై ఈడీ ఫోక‌స్.. వీటి వెన‌క ఉన్న అస‌లు ఉద్దేశం ఏంటి ?

పశ్చిమ బెంగాల్ లో బయటపడిన టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ గత కొంత కాలంగా విదేశీ పర్యటనలు చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే వీటి వెనక ఉన్న అసలు ఉద్దేశాలు ఏంటి అన్నది తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

WB SSC Scam : ED focus on Arpita Mukherjee's foreign tours.. What is the real intention behind these?
Author
Kolkata, First Published Jul 31, 2022, 10:11 AM IST

పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసు లో ప్ర‌ధాన నిందితుడైన పార్థ ఛటర్జీ స‌న్నిహితురాలు అర్పితా ముఖర్జీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన‌ట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఆమె పాస్ పోర్ట్ స్వాధీనం చేసుకున్న అందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు తెలుసుకున్నారు. ముఖ‌ర్జీ గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్‌లకు పర్యటనలు చేసినట్లు గుర్తించారు. దీంతో పాటు మ‌న దేశానికి పొరుగునే ఉన్న నేపాల్ ను  ఆమె పలుమార్లు సందర్శించారు. దీనికి సంబంధించిన క‌చ్చిత‌మైన ఆధారాల‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ సంపాదించింది.

ఈడీ ముందుకు వ‌చ్చిన ఈ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల విష‌యం అధికారుల మ‌న‌స్సుల్లో అనేక సందేహాల‌ను రేకెత్తిస్తున్నాయి. ఈ విదేశీ సందర్శనలు కేవలం ఎంజాయ్ మెంట్ కోసమే చేశారా లేక ఇందులో ఏదైనా ఆర్థిక ప్ర‌మేయానికి సంబంధించిన విష‌యం ఉందా అనేది ఇందులో మొద‌టి ప్ర‌శ్న. అర్పితా ముఖర్జీ ఒంటరిగానే ఈ పర్యటనలు చేశారా లేక ఆమె ఇంకా ఎవ‌రితోనైనా వెళ్లారా అనేది రెండో ప్ర‌శ్న‌. ఇక ఆమె విదేశీ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఈ దేశాలనే ఎందుకు ఎంచుకుంద‌నేది ఈడీ అధికారుల‌ను వేధిస్తున్న మూడో ప్ర‌శ్న‌. అయితే అర్పితా ముఖ‌ర్జీ చేసిన ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో ఆమెతో పాటు ఎప్పుడైనా పార్థ చ‌ట‌ర్జీ వెళ్లారా అనేది చాలా ముఖ్య‌మైన ప్ర‌శ్న‌. 

శివసేన ఎంపీ సంంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారుల సోదాలు..

అయితే ఈ విషయాలపై అర్పితా ముఖర్జీని ఈడీ ప్ర‌శ్నించ‌డం ప్రారంభించిన‌ట్టు వ‌ర్గాలు వెల్ల‌డించాయ‌ని ‘జీ న్యూస్’ ఓ కథనంలో పేర్కొంది. అయితే ఈడీ ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఇస్తున్న స‌మాధానాలు అస్స‌లు పొంత‌న లేకుండా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. పార్థ చ‌ట‌ర్జీ, అర్పితా ముఖర్జీలకు ఆగస్టు 3వ తేదీ వ‌ర‌కు కష్ట‌డీ గ‌డువు ఉంద‌ని తెలుస్తోంది. ‘‘ మా ప్ర‌శ్న‌ల‌కు ఇప్పటికీ సమాధానం రాలేదు. అర్పిత మాకు సహకరించడం ప్రారంభించినప్పటికీ, మాజీ మంత్రి ఇప్పటికీ సహకరించ‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వారి క‌ష్టడీని పొడ‌గించాల్సిన అస‌వ‌రం ఉంద‌ని మేము కోర్టుకు కోరుతాం’’ అని ఒక అధికారి తెలిపారు.

వీరిద్దరిని అరెస్టు చేసినప్పటి నుంచీ ఇప్పటి వరకు వారిని విచారించడంపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారని ఈడీ వర్గాలు తెలిపాయి. అయితే ఇంటరాగేషన్ సమయంలో మరికొంత మంది పేర్లు బయటకు వచ్చాయి. వారినందరినీ ఈ కేసు రెండో ద‌శ‌లో ఈడీ ప్ర‌శ్నించ‌నుంది. అయితే వీరంతా ఈ మొత్తం స్కామ్ లో మెయిన్ గా కలెక్షన్ ఏజెంట్ లు గా వ్యవహరించిన వారే అని ఈడీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ‘‘ ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది మొత్తం స్కామ్ లో చిన్న భాగం మాత్ర‌మే. రాబోయే కొద్ది వారాలు చాలా కీలకం ’’ అని ఈడీ అధికారి ఒకరు తెలిపారు.

బెంగాల్ లో జార్ఖండ్ కాంగ్రెస్ నేతల నుంచి భారీ నగదు స్వాధీనం.. అరెస్ట్ !

ఎవ‌రీ అర్పితా ముఖ‌ర్జీ...
ఈ కేసులో మొద‌టి నుంచి అర్పితా ముఖర్జీ పేరు వినిపిస్తోంది. అయితే ఆమె గురించి జనాలకు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియదు. ఆమె మంత్రి పార్థ ముఖర్జీకి సన్నిహితురాలు. నటి, మోడల్ గా ఉన్న అర్పిత ఒడిశా చిత్ర పరిశ్రమలో నటించింది. ఆమె అనేక తమిళ చిత్రాలకు కూడా పనిచేసింది. మామా-భంగే, పార్టనర్ తో క‌లిసి బెంగాలీ చిత్రాలలో కూడా ఆమె న‌టించారు. మూలాల ప్రకారం.. ఆమె చాలా సంవత్సరాలుగా నక్తలా పూజను ప్రమోట్ చేస్తోంది. అలాగే అర్పితా బెహలా వెస్ట్ సెంటర్‌లో పార్థ ఛటర్జీతో కలిసి కొన్ని సార్లు ప్రచారం చేయడం కూడా క‌నిపించింది. గత కొన్నేళ్లుగా దక్షిణ కోల్‌కతాలోని ఓ విలాసవంతమైన ఫ్లాట్‌లో నివసిస్తోంది. అయితే ఈ స్కామ్ లో భాగంగా ప్లాట్ పై ఈడీ దాడి చేసింది. ఈ సంద‌ర్భంగా కుప్పలు కుప్ప‌లుగా డ‌బ్బు క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ‌టం యావత్ దేశాన్ని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios