వయనాడ్ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024
కాఫీ, టీ, కొక్కో, నల్ల మిరియాలు, వెల్లుల్లి పంటలకు వయనాడ్ కేంద్రం. పచ్చని ప్రకృతే కాదు.. ఇక్కడి రాజకీయాలు కూడా హాట్ హాట్‌గా సాగుతాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేయడంతో వయనాడ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల ముస్లింల ప్రాబల్యం అధికం. వారు తొలి నుంచి కాంగ్రెస్ వైపే వుండటంతో ఆ పార్టీ సునాయాసంగా గెలుస్తోంది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వయనాడ్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్ 3, సీపీఎం 2, ఐయూఎంఎల్, ఎల్డీఎఫ్ తలో ఒక చోట విజయం సాధించాయి. రాహుల్ గాంధీ మరోసారి బరిలో దిగుతున్నారు. సీపీఐ తరపున అన్నీ రాజా, బీజేపీ తరపున కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.
కేరళలోని అందాల ప్రదేశాల్లో వయనాడ్ ఒకటి. పశ్చిమ కనుమల పర్వతశ్రేణి మధ్య విస్తరించిన వయనాడ్ కేరళలోని హిల్ స్టేషన్‌లలో ప్రముఖమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. సముద్ర మట్టానికి ఎత్తులో వుండటం, దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా ఏప్రిల్, మే మినహా సంవత్సరంలో మిగిలిన రోజుల్లో వాతావరణం అత్యంత శీతలంగా వుంటుంది. కాఫీ, టీ, కొక్కో, నల్ల మిరియాలు, వెల్లుల్లి పంటలకు వయనాడ్ కేంద్రం. పచ్చని ప్రకృతే కాదు.. ఇక్కడి రాజకీయాలు కూడా హాట్ హాట్‌గా సాగుతాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో ఇక్కడి నుంచి పోటీ చేయడంతో వయనాడ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.
వయనాడ్ ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. కాంగ్రెస్ కంచుకోట :
వయనాడ్‌లో హిందువుల జనాభా 49.7 శాతం, ఎస్సీలు 35.4 శాతం, ఎస్టీలు 7.6 శాతం, క్రిస్టియన్లు 21.5 శాతం, ముస్లింలు 28.8 శాతం. రాజకీయంగా వయనాడ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల ముస్లింల ప్రాబల్యం అధికం. వారు తొలి నుంచి కాంగ్రెస్ వైపే వుండటంతో ఆ పార్టీ సునాయాసంగా గెలుస్తోంది. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మనంతావడి (ఎస్టీ), సుల్తాన్ బాతేరీ (ఎస్టీ), కల్పేట్టా, తిరువాంబడి, ఎర్నాడ్, నీలాంబుర్, వాన్‌డోర్‌లు (ఎస్సీ) వున్నాయి.
వయనాడ్ లోక్‌సభ సెగ్మెంట్‌లో 13,59,679 మంది ఓటర్లు వున్నారు. వీరిలో పురుషులు 6,84,871 మంది.. మహిళలు 5,60,841 మంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10,92,197 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 80.33 శాతం పోలింగ్ నమోదైంది. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో వయనాడ్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభా స్థానాల్లో కాంగ్రెస్ 3, సీపీఎం 2, ఐయూఎంఎల్, ఎల్డీఎఫ్ తలో ఒక చోట విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రాహుల్ గాంధీకి 7,06,367 ఓట్లు.. సీపీఐ అభ్యర్ధి పీపీ సునీర్‌కు 2,74,597 ఓట్లు.. బీడీజేఎస్ అభ్యర్ధి తుషార్ వెళ్లప్పళ్లికి 78,816 ఓట్లు పోలయ్యాయి.
వయనాడ్ ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. రాహుల్‌ను ఓడించాలని బీజేపీ వ్యూహాలు :
2024 లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే రాహుల్ గాంధీ మరోసారి బరిలో దిగుతున్నారు. వయనాడ్‌లో కాంగ్రెస్ బలంగా వుండటం, సాంప్రదాయక ఓటు బ్యాంక్ కారణంగా మరోసారి తాను విజయం సాధిస్తానని యువనేత ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ తరపున అన్నీ రాజా, బీజేపీ తరపున కే సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఎలాగైనా ఓడించాలని బీజేపీ అన్ని రకాల అస్త్రశస్త్రాలను రెడీ చేస్తోంది.