సూరత్ లో విషాదం చోటు చేసుకుంది. ఈత కొట్టేందుకు వెళ్లిన ఆ యువకులు సముద్రపు బలమైన ఆటు పోట్లకు లోనయ్యారు. అవి లోపలకు లాక్కుపోవడంతో నీటిలో మునిగి ముగ్గురు యువకులు చనిపోయారు.
అంత వరకు బీచ్ లో సరదాగా ఈత కొడుతున్న ఆ ఐదుగురు యువకులు ఒక్క సారిగా ఊహించని ప్రమాదానికి గురయ్యారు. అక్క సారిగా అలలు వచ్చి వారిని సముద్రంలోకి లాక్కుపోయాయి. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. నిస్సాహాయక స్థితిలో ఉండిపోయారు. దీంతో స్థానికంగా ఉండే డ్రైవర్లు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కరిని మాత్రమే కాపడగలిగారు. ముగ్గురు ఆ నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారు. మరొకరి జాడ తెలియడం లేదు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో విషాదం చోటు చేసుకుంది. ఆ పట్టణంలో ఉన్న హజీరాస్ సువాలీ బీచ్‌లో ఈత కొడుతున్న ఐదుగురు యువకుల్లో ముగ్గురు యువకులు సముద్రపు నీటిలో మునిగి చనిపోయారు. ఆ ముగ్గురి మృతదేహాలను ఫైర్ సిబ్బంది వచ్చి నీటిలో నుంచి బయటకు తీశారు. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం నాడు సూరత్ హజీరాలోని సువాలీ బీచ్ కు ఐదుగురు యువకులు వచ్చారు. సరదాగా సముద్రపు నీటి ఒడ్డున ఈత కొడుతున్నారు. అయితే ఒక్క సారిగా భారీ ఆలలు వారి దిక్కుకు వచ్చాయి. ఆ ఆలల భారీ ప్రవాహానికి వారి తట్టుకోలేకపోయారు. ఆ అలల వెంటే సముద్రం లోపలకు వెళ్లిపోయారు. దీంతో వారంతా నీటిలో మునిగిపోసాగారు. స్థానికంగా ఉన్న డ్రైవర్లు వీరి పరిస్థితిని గమనించారు. కాపాడేందుకు ప్రయత్నం చేశారు. వీరి ప్రయత్నం ఫలించి ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు.
Monkeypox: పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి.. మంకీపాక్స్ పై వైద్య నిపుణుల సూచన..
ముగ్గురు యువకులు సముద్రపు నీటిలో మునిగి చనిపోయారు. మరొకరు కనిపిచకుండా పోయారు. ఈ ఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మృతి చెందిన ముగ్గురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవర్ల చేతిలో ప్రాణాల దక్కించుకున్న యువకుడిని వికాష్ సాల్వే (21)గా పోలీసులు గుర్తించారు. అతడు అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది.
చనిపోయిన ముగ్గురిలో ఒకరు భాతర్ నివాసి సాగర్ సాల్వే (23) గా పోలీసులు గుర్తించారు. అయితే కనిపించకుండా పోయిన యువకుడు శ్యామ్ సంజయ్ సౌత్కర్ (22) అని హజీరా పోలీస్ ఇన్‌స్పెక్టర్ జేబీ బుబాడియా తెలిపారు. అగ్నిమాపక శాఖ స్థానిక డైవర్లతో కలిసి అతని ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఈ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.
