ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ వివాహ వేడుకలు  అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రపంచ కుబేరుడిగా పేరొందిన ముఖేష్  ఇంట్లో వివాహనికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఈ వివాహ కార్యక్రమంలో బాలీవుడ్ సినీ ప్రముఖులు, విఐపీలు, వివిఐపీలు  ముఖేష్ వివాహ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.ముఖేష్ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకాతో  జరగనుంది.

జూన్ 30వ తేదిన నిశ్చితార్ధం జరగనుంది. బుధవారం రాత్రి మెహందీ వేడుక అట్టహాసంగా నిర్వహించారు.  ఆకాశ్‌- శ్లోకాల మెహందీ వేడుకకు సచిన్‌ తెండూల్కర్‌ దంపతులతో పాటు షారూక్‌ ఖాన్‌ దంపతులు, ప్రియాంకా చోప్రా, కరణ్‌ జోహార్‌, కిరణ్‌ రావ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌ వంటి బాలీవుడ్‌ తారలు వచ్చి సందడి చేశారు. ఇదే వేడుకలో ముఖేష్‌‌‌ సతీమణి నీతా అంబానీ చేసిన డ్యాన్స్‌ చేశారు.

 

2013లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘కై పో చే’లోని ‘శుభారంభ్‌’ అనే పాటకు ఆమె సంప్రదాయ నృత్యం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఈ వేడుకలో ఎరుపు రంగు చీర ధరించిన నీతా తనదైన శైలిలో స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.

 

అయితే నీతా ఇలాంటి నృత్యం చేయడం ఇదే తొలిసారి కాదు. ముకేశ్‌-నీతాల కుమార్తె ఈశా అంబానీ నిశ్చితార్థ వేడుకలోనూ అతిలోక సుందరి శ్రీదేవీ పాటకు నీతా స్టెప్పులు వేసి అలరించారు.