ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్ డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల కాశ్మీర్ లో హింస గణనీయంగా తగ్గుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం పట్ల తమ ప్రభుత్వం అవలంభిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు.
ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న జీరో టాలరెన్స్ విధానం రాబోయే కాలంలోనూ కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో ఆదివారం 54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) రైజింగ్ డే పరేడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వేర్పాటువాదం, ఉగ్రవాదం, దేశవ్యతిరేక కార్యకలాపాలను కఠినంగా ఎదుర్కొంటామన్నారు.
ఇల్లు పునాది తవ్వుతుండగా భారీ నగల పెట్టే లభ్యం.. అందులో ఓల్డ్ కాయిన్లు, వెండి ఆభరణాలు.. ఎక్కడంటే?
గత తొమ్మిదేళ్లలో అంతర్గత భద్రతా సవాళ్లను ఎన్ డీఏ ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొందని, కాశ్మీర్ లో హింస గణనీయంగా తగ్గుతోందని అమిత్ షా తెలిపారు. ఈశాన్య, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుబాటు కూడా తగ్గిందని, ప్రజల విశ్వాసం పెరుగుతోందని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు.
ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న వారి సంఖ్య తగ్గుతోందని, చాలా మంది ఆయుధాలు వదులుకుని ప్రధాన స్రవంతిలో చేరుతున్నారని అమిత్ షా తెలిపారు. హకీంపేటలోని సీఐఎస్ఎఫ్ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ)లో తొలిసారిగా సీఐఎస్ఎఫ్ వార్షిక రైజింగ్ డే వేడుకలను నిర్వహిస్తోంది.
భారత పార్లమెంటు చట్టం ప్రకారం 1969 మార్చి 10న సీఐఎస్ఎఫ్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి 10న సీఐఎస్ఎఫ్ రైజింగ్ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సీఐఎస్ఎఫ్ వార్షిక రైజింగ్ డే వేడుకలు నేడు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. భారత అంతర్గత భద్రతకు సీఐఎస్ఎఫ్ మూలస్తంభాల్లో ఒకటని అమిత్ షా శనివారం అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ వెలుపల సీఐఎస్ఎఫ్ 'రైజింగ్ డే' వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ప్రతీ ఏటా ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్ లోని సీఐఎస్ ఎఫ్ మైదానంలో జరిగేది.
ఫుల్లుగా తాగి పెళ్లి పీటలెక్కిన వరుడు.. కూర్చున్న చోటనే తూలుతూ నిద్రలోకి.. తరువాత ఏమైందంటే ?
గత ఏడాది ఘజియాబాద్ ఇందిరాపురంలో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 53వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా పారామిలటరీ దళాలన్నీ ఢిల్లీ వెలుపల తమ రైజింగ్ డేను జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం (ఎల్ డబ్ల్యూఈ) ప్రాబల్యం ఉన్న ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో మార్చి 19న సీఆర్ పీఎఫ్ వార్షిక ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనుందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది.
