అస్సాంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వరుడు ఫుల్లుగా తాగి పెళ్లి పీటలు ఎక్కాడు. పంతులు మంత్రాలు చదువుతుండగానే ఆ పెళ్లి కొడుకు నిద్రపోయాడు. దీంతో వదువు పెళ్లిని రద్దు చేసుకుంది. 

ఇటీవల కాలంలో కొన్ని పెళ్లిలు మండపంలోనే ఆగిపోతున్నాయి. కట్నం తక్కువైందని, పాత ఫర్నీచర్ ఇచ్చారని పీటలపైనే పెళ్లిళ్లు నిలిచిపోయిన ఘటనలకు సంబంధించిన వార్తలను మనం ఇటీవల చదివాం. అయితే కట్నం తక్కువగా ఇచ్చారని వధువే వివాహాన్ని నిలిపివేసిన వార్త రెండు రోజుల కిందట హల్ చల్ చేసింది. తాజాగా ఇలాంటి ఘటనే అస్సాంలో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు చేసిన పనికి పెళ్లి కూతురు కోపం వచ్చి వివాహాన్ని ఆపేసింది.

హైదరాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా..

వివరాలు ఇలా ఉన్నాయి. అది అస్సాం రాష్ట్రంలోని నల్బరీ జిల్లా. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ప్రసేన్‌జిత్ హలోయ్‌ అనే యువకుడి వాహం జరుగుతోంది. ముహుర్తం దగ్గరకి వస్తోంది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పంతులుగారు వరుడిని మండపంలోకి పిలిచాడు. పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నాడు. అయితే ఆ పెళ్లి కొడుకు పీటలపై స్థిరంగా కూర్చులేకపోతున్నాడు. మెళ్లగా అటూ ఇటూ తూలుతున్నాడు. పెళ్లికి ముందు వరుడు ఫుల్లుగా తాగి రావడమే దీనికి కారణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

యూపీలో ఘోరం.. గుడిసెకు మంటలు అంటుకొని ఐదుగురు సజీవదహనం.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు..

ఫుల్లుగా మత్తులో ఉన్న పెళ్లి కొడుకు నిద్రను ఆపుకోవడానికి నానా తంటాలు పడ్డాడు. కానీ చివరికి పెళ్లి పీటలపైనే పడుకున్నాడు. వరుడి తీరును గమనించిన వదువుకు కోపం వచ్చింది. దీంతో తాను అతడిని పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్త మామలపై కూడా కేసు పెట్టింది. తన పెళ్లి కోసం ఖర్చయిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. 

Scroll to load tweet…

పెళ్లికి పెద్దగా ఉండి, అన్ని పనులను చూసుకోవాల్సిన వరుడు తండ్రి కూడా ఈ సమయంలో తాగి ఉండటం ఇక్కడ కొసమెరుపు. చివరికి వధువు తరఫు కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను సంప్రదించారు. వారి సమక్షంలో పెళ్లిని రద్దు చేసుకున్నారు. అయితే వరుడి తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.