ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా ఆభరణాలతో ఉన్న ఇనుప పెట్టే బయటపడింది. పునాది పనుల్లో ఉన్న కార్మికుడు ఆ పెట్టేపై పడిపోయాడు. పెట్టెను బయటకు తీసి ఓపెన్ చేయగా అందులో పాత కాయిన్లు, వెండి ఆభరణాలు ఉన్నాయి. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఇంటికి పునాది తవ్వుతుండగా ఆభరణాలతో భారీ పెట్టే బయల్పడింది. పునాది పనుల్లో ఉన్న ఓ లేబర ఆ పెట్టె కాలికి తగలడంతో దాదాపు కింద పడిపోయాడు. వెంటనే దాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. అనంతరం, దాన్ని వెలికి తీశారు. ఆ పెట్టే తెరిస్తే అందులో పాత కాయిన్లు, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆ పెట్టెనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించినట్టు అధికారులు ఆదివారం తెలిపారు.

ఆ ఇనుప పెట్టెలో 279 కాయిన్లు ఉన్నాయని, అవి 1862 కాలానికి చెందినవని అధికారులు వివరించారు. కొత్వాలి జాలైన్‌లో వ్యాస్ పురా గ్రామంలో ఓ ఇంటి కోసం శనివారం పునాది తవ్వుతుండగా ఈ కాయిన్లు, ఆభరణాలు వెలికి వచ్చాయని, వాటిని రికవరీ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Also Read: రజనీకాంత్ కి తీవ్ర అనారోగ్య సమస్య, అందుకే రాజకీయాలకు దూరం... స్వయంగా క్లారిటీ ఇచ్చిన తలైవా!

ఒరాయ్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాజేశ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజనా కింద కమలేశ్ కుశ్వాహాకు ఓ ఇంటి కోసం స్థలం కేటాయించారని వివరించారు. ఆ స్థలంలో ఇల్లు నిర్మించడానికి పునాది తవ్వుతున్నారని, శనివారం ఇలా తవ్వుతుండగా ఆ పురాతన ఇనుప పెట్టే బయటపడిందని చెప్పారు. పునాది తీసే పనిలో ఉన్న ఓ కార్మికుడు ఆ కంటైనర్ పై పడిపోయాడని వివరించారు. రాజేశ్ సింగ్ వెంటనే ఆర్కియలాజికల్ ఆఫీసర్లకు ఫోన్ చేశాడని, స్పాట్‌కు రప్పించి ఆ ఆభరణాలు, కాయిన్లను వారికి అప్పగించినట్టు తెలిపారు.