New Delhi: దేశ అంతర్గత భద్రతను పెంపొందించేందుకు, రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చేందుకు విజయవంతమైన ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు.  

Lok Sabha Election 2024: దేశంలో మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, రానున్న ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) కి ఎదురులేద‌నీ, త‌మ‌దే విజ‌య‌మ‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్య‌క్తం చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అమిత్ షా మాట్లాడుతూ.. కేంద్ర కార్యక్రమాలు అట్టడుగు స్థాయి ప్రజల జీవితాలలో సానుకూల మార్పును గుర్తించాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో దేశ పౌరులు హృదయపూర్వకంగా ఆయ‌న‌తో క‌లిసి ముందుకు సాగుతున్నార‌ని అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు, దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పోటీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగ‌ళ‌వారం అన్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను జీతితాల్లో మార్పున‌కు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. 

కేంద్రంలో బీజేపీ 8 ఏళ్ల పాలన..

కేంద్రంలో తమ పార్టీ చేస్తున్న కృషిని వివరించిన అమిత్ షా రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంపై విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ దేశంలో గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాలుగా మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని తెలిపారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ మెరుప‌డింది..

త‌మ‌ పాల‌న‌లో భారతదేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందనీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని ప్రస్తావించారని షా అన్నారు. దేశ పురోగతి, దేశాన్ని సురక్షితంగా మార్చడం-ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చడం నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంద‌ని తెలిపారు. ప్రపంచంలో భారత్ సాధించిన విజయాలకు గుర్తింపు ఉందని కూడా ఆయ‌న అన్నారు. 

దేశ రక్షణను బలోపేతం చేయడానికి చ‌ర్య‌లు తీసుకున్నాం..

అంతర్గత భద్రతను పెంపొందించేందుకు, రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అమిత్ షా తెలిపారు. భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చేందుకు విజయవంతమైన ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు. స్వావలంబన భారత్‌పై దృష్టి సారించిన షా, రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఎనిమిదేళ్లలో ఇతర దేశాలపై భారత్ ఆధారపడటాన్ని 30 శాతం తగ్గించడం పెద్ద విజయం అని ఆయన అన్నారు. 

పేద‌ల జీవితాల‌ను మెరుగుప‌ర్చేందుకు.. 

తమ‌ ప్రభుత్వ విజయాలపై షా మాట్లాడుతూ "ఎనిమిదేళ్ల చిన్న కాలంలో, దేశంలోని 60 కోట్ల మంది పేదల జీవన ప్రమాణాలను పెంచడానికి మేము ప్రయత్నించాము. మేము కూడా విజయం సాధించాము. ఇందులో చాలా విజయాలు ఉన్నాయి. రైల్వేలో పెద్ద మార్పులు తీసుకువ‌చ్చాము. అంతరిక్ష రంగంలో కొత్త విధానం ఉంది. మేము ఆయా రంగాల్లో అగ్రగామిగా ఉండేందుకు సిద్ధమవుతున్నాము, కొత్త విధానంతో మేము డ్రోన్ రంగంలో ముందుకు సాగుతున్నాము" అని షా తెలిపారు. 

తీవ్ర‌వాదంపై.. 

"వామపక్ష తీవ్రవాదం ముగింపు దశకు చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై మా ఏజెన్సీల నియంత్రణ-ఆధిపత్యం ఉంది. ఈశాన్య ప్రాంతంలో, మేము పరిష్కారాలను (సమస్యలకు) కనుగొన్నాము. 8,000 మంది తీవ్రవాద సంస్థల సభ్యులు ప్రధాన స్రవంతిలో చేరారు" అని అమిత్ షా అన్నారు.