Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ నటి ఆశా పరేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఈ ఏడాది ప్రముఖ నటి ఆశా పరేఖ్‌కు లభించింది. త్వరలోనే ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. 

Veteran actress Asha Parekh was awarded the Dadasaheb Phalke Award
Author
First Published Sep 27, 2022, 2:18 PM IST

ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపార‌ని వార్తా సంస్థ ANI తెలిపింది. అయితే  సినిమా రంగానికి చేసిన సేవలకు గాను 1992లో భారత ప్రభుత్వం ఆమెకు ప‌ద్మ శ్రీ అవార్డు కూడా ప్ర‌దానం చేసింది. 

రెండు రోజుల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ.. రూ.29 వేల కోట్ల అభివృద్ది ప‌నుల‌కు శ్రీకారం

ఆశా పరేఖ్ కు హిందీ చిత్రాల్లో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒక‌రిగా పేరుంది. ఆమె బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె 10 సంవత్సరాల వయస్సులో బిమల్ రాయ్ నిర్మించిన మా (1952) అనే సినిమాలో న‌టించింది. అయితే త‌రువాత కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉంది. ఆ స‌మ‌యంలో త‌న చ‌దువును ఆమె పూర్తి చేసింది. త‌రువాత నాసిరి హుస్సేన్ రూపొందించిన దిల్ దేకే దేఖో (1959) సినిమాతో తిరిగి త‌న కెరీర్ ను ప్రారంభించింది.  ఇందులో షమ్మీ కపూర్ కూడా నటించారు.

ఆషా, హుస్సేన్ ల కాంబినేష‌న్ లో ప‌లు హిట్ చిత్రాలు వ‌చ్చాయి. ఇందులో జబ్ ప్యార్ కిసీ సే హోతా హై (1961), ఫిర్ వోహీ దిల్ లయా హూన్ (1963), తీస్రీ మంజిల్ (1966), బహరోన్ కే సప్నే (1967), ప్యార్ కా మౌసం (1969), కారవాన్ (1971). రాజ్ ఖోస్లా దో బదన్ (1966), చిరాగ్ (1969), మెయిన్ తులసి తేరే ఆంగన్ కి (1978), శక్తి సమంతా రూపొందించిన కటి పతంగ్ చిత్రాల్లో ఆమెకు మంచి గుర్తింపు ల‌భించింది. కాగా.. ఆమె గంభీరమైన పాత్ర‌ల‌కు ప్రసిద్ధి చెందింది.

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి లైవ్ స్ట్రీమ్.. లైవ్ టెలికాస్ట్‌లో వాదనలు.. ఇక్కడ చూసేయండి..!

ఆశా పరేఖ్ గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లో కూడా న‌టించారు. 70-80వ దశకం త‌రువాత ఆమె వెండితెర‌ను వ‌దిలి బుల్లితెరలోకి ప్ర‌వేశించింది. ఇందులో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఆమె 1990లో గుజరాతీ సీరియల్ జ్యోతికి దర్శకత్వం వహించారు. పలాష్ కే ఫూల్, బాజే పాయల్, కోరా కాగజ్, దాల్ మే కాలా వంటి షోలను నిర్మించింది.
ప్రేమికురాలిని హ‌త్య చేసి, మృత‌దేహాన్ని పారేయ‌డానికి అంబులెన్స్ ను అద్దెకు తీసుకున్న ప్రేమికుడు..

భారతీయ చలనచిత్ర రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అత్యున్నత పురస్కారం. గతంలో రాజ్ కపూర్ , యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నాలు ఈ అవార్డును అందుకున్నారు. దేవికా రాణి మొదటి విజేత కాగా, రజనీకాంత్ 2021లో చివ‌రి సారిగా ఈ పుర‌స్కారాన్ని అందుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios