Coronavirus: మ‌రో బీజేపీ ఎంపీకి క‌రోనా పాజిటివ్.. తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలున్నాయ్ !

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకూ భారీ సంఖ్యలో ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆయన  ట్విట్టర్ వేదిక‌గా వెల్లడించారు.
 

Varun Gandhi tests positive for Covid, urges EC to give candidates, campaign workers booster dose

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకూ భారీ సంఖ్యలో ఈ మహమ్మారి బారినపడుతున్నారు.ఇటీవల పలువురు సినిమా స్టార్స్, కేంద్ర మంత్రులు, ఢిల్లీ, రాజస్థాన్, జ‌ర్ఖండ్ రాష్ట్రాల సీఎంలు, 11 మంది మహారాష్ట్ర మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు Coronavirus బారినప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రో బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు సైతం ఉన్నాయ‌ని పేర్కొన‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. వివ‌రాల్లోకెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బీజేపీ నేత‌, పార్ల‌మెంట్ స‌భ్యులు వ‌రుణ్ గాంధీ కి Covid-19 సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆదివారం నాడు వెల్ల‌డించారు. 

క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ గా తేలింద‌ని పేర్కొన్న వ‌రుణ్ గాంధీ.. తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు సైతం ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. తన నియోజకవర్గమైన పిలిభిత్‌లో మూడు రోజులు పర్యటించాన‌ని తెలిపారు. ఆ సమయంలో తనకు Covid-19 సోకి ఉండొచ్చని వ‌రుణ్ గాంధీ వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొన్నారు. Covid-19 ప‌రీక్ష‌లు సైతం చేయించుకోవాల‌ని తెలిపారు. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితులు నేప‌థ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రస్తుతం మనం థర్డ్ వేవ్‌ మిడిల్‌లో ఉన్నామని వెల్ల‌డించిన వ‌రుణ్ గాంధీ..  ప్రస్తుతం Coronavirus కేసులు పెరుగుతున్నాయ‌నీ, ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల ప్ర‌చారాలు కొన‌సాగించిన క్ర‌మంలో కేసులు పెరిగే అవ‌కాశ‌ముంద‌నీ, ప్రికాషనరీ డోసు (బూస్టర్ డోసు) వ్యాక్సిన్‌ను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నేతలకు కూడా వేసేలా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలివ్వాలని కోరారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇంట్లో Coronavirus కలకలం రేపింది. ఆయన సతీమణితోపాటు ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కరోనా వైర‌స్ సోకింది. అయితే, ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు ప్ర‌స్తుతం నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా వ‌చ్చింద‌ని అధికారులు పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ముఖ్యమంత్రి నివాసంలో 62 మందికి  క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌నీ, ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు వ‌చ్చిన రిపోర్టుల్లో 15 మందికి Coronavirus సోకింద‌ని రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ వెల్లడించారు. ఇప్ప‌టివ‌ర‌కు 24 మంది క‌రోనా ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన రిపోర్టులు వ‌చ్చాయ‌ని వెల్ల‌డించారు. ఇందులో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.

ఇటీవ‌ల ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు Covid-19 సోకిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆయ‌న‌కు ఆదివారం మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..  కరోనా నెగెటివ్‌గా తేలింది. కేజ్రీవాల్ కు  జనవరి 4న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగెటివ్‌ రావడంతో ఆయన విధుల్లో పాల్గొననున్నారు. త‌న‌కు నెగ‌టివ్ వ‌చ్చింద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఇదిలావుండ‌గా, పార్ల‌మెంట్‌లో ప‌నిచేస్తున్న వారిలో ఎక్కువ మంది Coronavirus బారిన‌ప‌డ్డారు. పార్లమెంటులో మొత్తం 1,409 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 400 మంది Covid-19 బారిన‌ప‌డ్డార‌ని అధికారులు తెలిపారు. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డ వారి న‌మునాల‌ను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపినట్లు వెల్లడించారు. ఈ నాలుగు వంద‌ల మంది ఈ నెల 4 నుంచి 8 మ‌ధ్య‌నే క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డార‌ని అధికారులు పేర్కొన్నారు. Coronavirus సోకిన పార్ల‌మెంట్ సిబ్బందిలో  పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో 200 మంది లోక్‌సభ సిబ్బంది, 69 మంది రాజ్యసభ, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios