Asianet News TeluguAsianet News Telugu

విషాదం..హైవోల్టేజీ వల్ల పేలిన ఏసీ.. మహిళ మృతి, కుమారుడికి అస్వస్థత..

ఏపీలోని ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ పేలడంతో ఓ మహిళ మరణించింది. ఆమె కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు. మృతురాలు ఒంగోలు జిల్లా పరిషత్ ఆఫీసులో పీఎఫ్ సెక్షన్ లో ఉద్యోగం చేసేవారు. 

Tragedy.. AC exploded due to high voltage.. Woman died, son ill..ISR
Author
First Published May 31, 2023, 6:52 AM IST

వేసవి ఉక్కపోత నుంచి రక్షణ పొందేందుకు పెట్టించుకున్న ఏసీ ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ఎప్పటిలాగే ఏసీ ఆన్ చేసి నిద్రపోయిన ఆమె..నిద్రలోనే అస్వస్థతకు గురయ్యారు. ఏసీ పేలడంతో అందులో నుంచి విష వాయువులు పీల్చడం వల్ల ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది. ఆమె పక్కనే నిద్రపోతున్న కుమారుడు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరినీ స్థానికులు గమనించి, హాస్పిటల్ కు తరలించారు. కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో ఆ మహిళ మరణించింది. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

షహాబాద్ ఘటనపై కేజ్రీవాల్ దిగ్భ్రాంతి.. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారమిస్తామని ప్రకటన

వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి ప్రాంతంలో 52 ఏళ్ల దామర్ల శ్రీదేవి అనే మహిళ తన కుమారుడు సాయితేజతో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఆమె ఒంగోలు జిల్లా పరిషత్ ఆఫీసులో పీఎఫ్ సెక్షన్ లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె భర్త వెంకట సుబ్బారెడ్డి టీచర్ గా పని చేస్తున్న సమయంలో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఆ ఉద్యోగం అందించింది. చీమకుర్తి పట్టణంలోని పల్లపోతు వారి వీధిలో ఆమె నివాసం ఉంటూ విధులకు హాజరవుతూ ఉండేది.

కనీసం కొంత మంది క్రీడాకారులకైనా గౌరవం దక్కుతోంది - సీఎస్ కే విజయంపై రెజ్లర్ సాక్షి మాలిక్ స్పందన

కాగా.. ఎప్పటిలాగే ఈ నెల 28వ తేదీన రాత్రి శ్రీదేవి, ఆమె కుమారుడు సాయితేజ ఇంట్లో నిద్రపోయారు. అయితే వారి ఇంట్లో హైవోల్టేజీ కరెంట్ సరఫరా కావడంతో వైర్లు కాలిపోయాయి. దీంతో ఏపీ పేలిపోయింది. ఈ విషయం నిద్రలో ఉన్న తల్లి కుమారులు గమనించలేదు. ఏపీ పేలడం వల్ల విషవాయువులు వెలువడ్డాయి. వాటిని నిద్రలో ఉన్న తల్లి కుమారులు పీల్చుకున్నారు. దీంతో వారిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. 

ముస్లిం బాలికను ఇంట్లో డ్రాప్ చేశాడని హిందూ బాలుడిపై దాడి.. ఆమెతో ఎందుకు ఉన్నావని ప్రశ్నలు..

కాగా.. ఏసీ పేలడం వల్ల ఇంట్లో నుంచి పొగలు వెలువడ్డాయి. వీటిని స్థానికులు గమనించారు. వెంటనే ఆ ఇంటికి చేరుకొని అస్వస్థతకు గురైన తల్లీ కుమారులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇక అప్పటి నుంచి వారిద్దరూ ఒంగోలు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కానీ శ్రీదేవి పరిస్థితి విషమించింది. ఆమె మంగళవారం రాత్రి చనిపోయారు. అయితే కుమారుడు సాయితేజ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios