Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ లో మళ్లీ కవిత పేరు.. ఆమె అసలైన పెట్టుబడిదారంటూ ఆరోపణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తాజాగా సప్లిమెంటరీ చార్జి షీట్ దాఖలు చేసింది. అందులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. మొత్తంగా ఈడీ దాఖలు చేసిన అడిషనల్ చార్జిషీట్ 278 పేజీలు ఉండగా.. ఆమె పేరును 53 సార్లు పేర్కొంది. 

Delhi Liquor Scam.. Kavitha's name again in ED's supplementary chargesheet.. Allegation that she is the original investor..ISR
Author
First Published May 31, 2023, 9:16 AM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జి షీట్ లో మళ్లీ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది. రద్దయిన ఢిల్లీ మద్యం విధానంలో ఆమె అసలైన పెట్టుబడిదారు అని ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమెకు బినామిగా వ్యవహరించిన అరుణ్ పెళ్లై స్వయంగా తన వాంగ్మూలంలో అంగీకరించారని పేర్కొంది. వంద కోట్ల కిక్ బ్యాక్ ల విషయం ఆమెకు తెలుసని, పిళ్లై చెప్పారని ఈడీ తన చార్జిషీట్ లో వివరించింది.  సౌత్‌ గ్రూప్‌ తో కలిసి ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, మరి కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ప్రతినిధి విజయ్‌నాయర్‌ ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది.

స్నేహితుడు మరణించాడని అంత్యక్రియలకు వచ్చిన అఘోర.. మృతదేహంపై కూర్చుని పూజలు చేయడంతో..

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మనీష్‌ సిసోడియాపై ఈడీ ఇటీవల దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ ను మంగళవారం ఢిల్లీ స్పెషల్ కోర్టు జడ్జి ఎంకే నాగ్ పాల్ యాక్సెప్ట్ చేశారు. ఈ విషయంలో విచారణను రేపటికి వాయిదా వేశారు. కాగా.. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ 278 పేజీలు ఉంది. అందులో సుమారు 53 సార్లు కవిత పేరు ప్రస్తావించినట్టు ‘సాక్షి’ కథనం పేర్కొంది.

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన సప్లిమెంటరీ చార్జిషీట్ లో పలు ప్రధాన అంశాలను ప్రస్తావించింది. 2022 నవంబర్ 11, 20వ తేదీల్లో అలాగే ఈ ఏడాది ఫిబ్రవరి 16, మార్చి 6 తేదీల్లో ఈ కేసుకు సంబంధించి పలు సమావేశాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ఇందులో ఎమ్మెల్సీ కవిత తరఫున ఇండో స్పిరిట్స్‌ భాగస్వామి అరుణ్‌ పిళ్లై హాజరయ్యారని ఆరోపించింది. గతేడాది ఏప్రిల్ 8వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్‌ మైడెన్స్‌లో ఓ సమావేశం జరిగిందని, అందులో విజయ్‌నాయర్, దినేశ్‌ అరోరా, కవిత, అరుణ్‌ పిళ్లై పాల్గొన్నారని ఈడీ పేర్కొంది.

విషాదం..హైవోల్టేజీ వల్ల పేలిన ఏసీ.. మహిళ మృతి, కుమారుడికి అస్వస్థత..

బీఆర్ఎస్ నేత కవిత కోసం పని చేస్తున్న వారికి కిక్‌బ్యాక్‌ల సొమ్ము చెల్లించేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాల తరఫున ఢిల్లీ లిక్కర్ పాలసీలో విజయ్ నాయర్ మార్పులు చేశారని, బుచ్చిబాబు తన వాగ్మూలంలో చెప్పారని ఈడీ పేర్కొంది. ఈ పాలసీ రూపొందించేందుకు ముందు, అనంతరం కూడా విజయ్ నాయర్ తో ఎమ్మెల్సీ కవిత కొన్ని సార్లు సమావేశం అయ్యారని ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ తో మాగుంట శ్రీనివాసులురెడ్డి సమావేశం అయ్యారని పేర్కొంది. ఢిల్లీలో లిక్కర్ బిజినెస్ లోకి మాగుంట రావడాన్ని కేజ్రీవాల్ స్వాగతించారని ఈడీ తన చార్జిషీట్ లో ఆరోపించింది. 

కవిత తరఫున అరుణ్‌ పిళ్లై, మాగుంట తరఫున ప్రేమ్‌ ఇండో స్పిరిట్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ పేర్కొంది. కాగా ఇందులో 65 శాతం షేర్లపై తాను పిళ్లైతోనే మాట్లాడానని, ఎప్పుడూ ప్రేమ్ ను నేరుగా కలవలేదని సమీర్ మహేంద్రు వాగ్మూలం ఇచ్చినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ తన చార్జిషీట్ లో వెల్లడించింది. అయితే అరుణ్ పిళ్లై వెనక ఎవరున్నారో చెప్పాలని సమీర్ మహేంద్రు ఆయనను కోరారని ఈడీ పేర్కొంది. తన వెనక కవిత ఉన్నారని పిళ్లై సమీర్ కు బదులు ఇచ్చారని ఈడీ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో భాగస్వామి కావడం హ్యాపీగా ఉందని కవిత సమీర్ కు ‘ఫేస్ టైం’ అనే యాప్ లో చెప్పారని ఈడీ ఆరోపించింది. 

గంగా నదిలో పతకాలు వేయడాన్ని విరమించుకున్న రెజ్లర్లు.. ఐదు రోజుల డెడ్‌లైన్‌తో ప్రభుత్వానికి అల్టిమేటం

వంద కోట్ల ముడుపులకు బదులు ఇండో స్పిరిట్ లో షేర్ ఇవ్వడంపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు మధ్య  ఓ అవగాహన ఉందని అరుణ్‌ పిళ్లై వాగ్మూలంలో చెప్పినట్టు ఈడీ వెల్లడించింది. అందుకే తాను ఆమె తరఫు ప్రతినిధిగా ఉన్నానని తెలిపారని పేర్కొంది. తాను ఎంతో కాలం నుంచి ఆమెకు స్నేహితుడిని అని పిళ్లై చెప్పారని ఈడీ ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios