Uttarakhand: వసుధైవ కుటుంబకం సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షంస్ తెలిపారు. "మన సంస్కృతిలో ప్రతి ఒక్కరినీ ప్రియమైన దేశంలో భాగంగా భావిస్తారు. పాకిస్థాన్ నుంచి వచ్చే పర్యాటకులకు ప్రేమ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. వారికి గంగాజలం, గీతను కానుకగా ఇచ్చాము. తద్వారా వారు తమ దేవాలయాలకు వాటిని పంపుతారు. వారి హిందు బంధువుల‌కు అందిస్తారు. భారతదేశం పట్ల ప్రేమ సందేశం అక్కడి దేవాలయాలకు చేరుతుందని" అన్నారు. 

Uttarakhand Sufi shrine: మతాల ఐక్యతను, మత సహనాన్ని నొక్కిచెప్పే ఒక ప్రత్యేకమైన ఘ‌ట‌న‌కు సాక్షంగా నిలుస్తోంది ఉత్త‌రాఖండ్ లోని సూఫీ పుణ్యక్షేత్రం. సబీర్ మఖ్దూం షా దర్గా ను సందర్శించే పాకిస్థానీయులకు గంగానది పవిత్ర జలం, భగవత్ గీత ప్రతిని, సహజ రుద్రాక్ష పూసల జపమాలను బహూకరించింది. సరిహద్దు వెంబడి ఉన్న ప్రజలకు ప్రేమ సందేశాన్ని అందించడం, మత సహనానికి, మత సామరస్యానికి ఆదర్శంగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ముస్లిం యాత్రికులు ఈ బహుమతులను తమ హిందూ సహచరులకు అందజేయాలనీ, హిందువుల ఉపయోగం కోసం దేవాలయాల్లో డిపాజిట్ చేయాలని కోరారు. పాకిస్తాన్ లోని హిందువులు గంగానది పవిత్ర జలం కోసం, వారి వస్త్రాల కోసం, వైద్యం చేసే శక్తులతో కూడిన పవిత్ర పూసల కోసం ఆరాటపడుతుంటారు.

వసుధైవ కుటుంబకం సంప్రదాయాన్ని తాము అనుసరిస్తున్నామని ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షంస్ తెలిపారు. మన సంస్కృతిలో ప్రతి ఒక్కరినీ ప్రియమైన దేశంలో భాగంగా భావిస్తారు. పాకిస్థాన్ నుంచి వచ్చే పర్యాటకులకు ప్రేమ సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. వారికి గంగాజలం, గీతను కానుకగా ఇచ్చామని, తద్వారా వారు తమ దేవాలయాలకు పంపుతారని, తద్వారా భారతదేశం పట్ల ప్రేమ సందేశం అక్కడి దేవాలయాలకు చేరుతుందని అన్నారు. తాము ఇచ్చిన కానుకలను పాకిస్థాన్ లోని ఆలయాలకు అందజేస్తామని పాక్ యాత్రికులు హామీ ఇచ్చారని షాదాబ్ షంస్ తెలిపారు. దేవాలయాలకు లేదా వ్యక్తులకు కానుకలు అందజేసే వీడియోలను రూపొందిస్తామని యాత్రికులు హామీ ఇచ్చారు. వీటన్నింటినీ స్మారక చిహ్నాలుగా తీసుకెళ్లి తమ హిందూ సోదరులకు అప్పగిస్తామని పాక్ యాత్రికులు షాదాబ్ కు చెప్పారు. ఇది త‌మ ప్రేమ, సోదరభావ సందేశాన్ని పెంపొందిస్తుందన్నారు.

పాకిస్తాన్ ప్రజలు అక్కడి దేవాలయాలతో అనుసంధానం కావాలనీ, అక్కడి సనాతన సంస్కృతిని ప్రోత్సహించాలని తాము కోరుకుంటున్నామని షాదాబ్ షంస్ అన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామ‌ని తెలిపారు. 107 మంది పాకిస్తానీ యాత్రికులకు గీత, గంగా జలాలను బహుమతిగా ఇచ్చామని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలిపారు. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుండి లక్షలాది మంది భక్తులు సూఫీ పీర్ వార్షిక ఉర్సులో పాల్గొనడానికి వస్తారు. యాత్రికులు ఐదు రోజులుగా దర్గాకు చేరుకుంటున్నారు. భారతీయులు, పాకిస్థానీలు ఒకరి మత విశ్వాసాలు, సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలని షాదాబ్ అన్నారు.

ఉత్తరాఖండ్ లో ఐదవ ధామ్ గా ప్రసిద్ధి చెందిన సబీర్ మఖ్దూం షా దర్గా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లాలోని కలియార్ లో ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లోని హార్ట్ లో 755 రబీ అల్-అవ్వాల్ 19 హిజ్రీలో జన్మించిన సూఫీకి చెందిన 592 సంవత్సరాల పురాతన దర్గా. అతని అసలు పేరు సయ్యద్ అలీ అహ్మద్. ఆయ‌న అల్లావుద్దీన్ సబీర్ సిల్సైల్ ను స్థాపించారు. దీనిని అలియా చిష్తియా సబారియా అని పిలుస్తారు.

(ఆవాజ్ ది వాయిస్ సౌజన్యంతో..)