శశిథరూర్ ముఖంపై ఇంక్ చల్లితే..నగదు బహుమతి

Uttar Pradesh: Muslim youth offers Rs 11K for blackening Shashi Tharoor’s face
Highlights

బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. దేశం హిందూ పాకిస్థాన్‌గా మారడం ఖాయమని శశిథరూర్ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలీఘర్‌కు చెందిన ముస్లిం యూత్ అసోసియేషన్ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్.. శశి థరూర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 
 

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖంపై ఇంక్ చల్లితే రూ.11వేలు నగదు నజరానా గా ఇస్తానని  ఓ ముస్లిం వ్యక్తి ఆఫర్ చేశాడు. ఆయన అలా ఆఫర్ చేయడానికి కారణం.. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలే.

ఇంతకీ మ్యాటరేంంటే.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే.. దేశం హిందూ పాకిస్థాన్‌గా మారడం ఖాయమని శశిథరూర్ వ్యాఖ్యానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలీఘర్‌కు చెందిన ముస్లిం యూత్ అసోసియేషన్ నాయకుడు మహ్మద్ అమీర్ రషీద్.. శశి థరూర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. 

శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు హిందూవులనే కాకుండా.. దేశభక్తి ఉన్న ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయని అమీర్ పేర్కొన్నాడు. హిందూ పాకిస్థాన్‌గా దేశం మారడం ఖాయమన్న శశిథరూర్ ముఖంపై నల్లటి ఇంకు చల్లిన వారికి రూ. 11 వేలు బహుమానం ఇస్తానని ఆయన తెలిపాడు. హిందూవులు, ముస్లింలను విడగొట్టేందుకు శశిథరూర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డాడు.

బుధవారం తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో థరూర్ ప్రసంగిస్తూ.. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ కనుక విజయం సాధించి, లోక్‌సభలో తగినంత బలముంటే.. దేశంలో ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం మనుగడ సాధించడం కష్టమే. కొత్త రాజ్యాంగాన్ని తీసుకొచ్చి, పాకిస్థాన్ మాదిరిగా మైనార్టీల హక్కులను కాలరాస్తుంది. మైనార్టీల సమానత్వాన్ని దెబ్బతీసేలా హిందూరాష్ట్ర ఏర్పాటు దాని లక్ష్యం. అదే జరిగితే దేశం హిందూ పాకిస్థాన్‌గా మారుతుంది. గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు ఏమవుతాయి? అని థరూర్ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మాటలే ఆయనను ఇరకాటంలో పడేశాయి.

loader