ఉత్తరప్రదేశ్ లో వింత సంఘటన జరిగింది. ఓ కుటుంబం తమ పెంపుడు కోడిపుంజుకు అంత్యక్రియలు, దశదినకర్మలు నిర్వహించి.. 500మందికి భోజనాలు పెట్టారు. దాని త్యాగాన్ని గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఉత్తరప్రదేశ్ : కొంతమంది తమ పెంపుడు జంతువులు చనిపోతే వాటికి అంత్యక్రియలు నిర్వహించిస్తుంటారు. వాటి మీద ఉన్న ప్రేమ కొద్ది వాటికి సమాధులు కట్టించడం కూడా చూస్తుంటాం. కానీ మనుషులు చనిపోతే చేసినట్టుగా కుటుంబమంత హడావుడి చేసి.. అంత్యక్రియలు నిర్వహించి దశదినకర్మలు చేయడం.. అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం గురించి ఎప్పుడైనా విన్నామా? అలాంటి ఓ వింత ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని ఓ కుటుంబంపెంచుకుంటున్నపెంపుడు కోడిపుంజు చనిపోయింది.
ఆ కుటుంబం ఆ కోడిపుంజుకి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా.. కుటుంబ సభ్యులు చనిపోతే చేసినట్లుగా అన్ని తతంగాలు చేశారు. 500 మందిని పిలిచి భోజనాలు కూడా పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ కోడిపుంజు ఆ కుటుంబం పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రె పిల్లను.. ప్రాణాలకు తెగించి వీధి కుక్కల బారినుంచి కాపాడింది. అయితే ఈ క్రమంలో ఆ కోడిపుంజు తీవ్రంగా గాయపడింది. దీంతో చనిపోయింది. అందుకే తన ప్రాణాన్ని పణంగా పెట్టిన కోడిపుంజుకి మనిషి చనిపోతే ఎలా చేస్తారో అలా అంత్యక్రియలు నిర్వహించారు.
‘కోడి పుంజు పోయింది.. వెతికి పెట్టండి ప్లీజ్’.. ఏపీ పోలీసులకు తలనొప్పిగా మారిన చోరీ..
‘మన కుటుంబంలోని మనిషి మాదిరిగా.. మన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. కాబట్టే మనుషులకు చేసే విధంగా ఆచారాలు అన్నింటినీ ఈ కోడిపుంజుకి నిర్వహిద్దామని తండ్రి చెప్పడంతో ఇలా చేశామ’ని చెబుతున్నారు అభిషేక్. ఆ కోడిపుంజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబం పెద్ద ఎత్తున దశదినకర్మ నిర్వహించింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది దాకా హాజరవడం విశేషం.
హిందూ సంప్రదాయ పద్దతిలో కుక్కల పెళ్లి.. 500మందికి విందు భోజనం..
ఇదిలా ఉంటే.. గతనెల జూన్ లో కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పెంపుడు కుక్క బర్త్ డేకు వంద కిలోల కేక్ కట్ చేశాడు. మందు లేదు కానీ.. మాంసంతో మంచి భోజనం వడ్డించాడు దాని యజమాని. అతిథులు కేక్ తిని భోజనాలు చేసి…ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో జరిగిన ఈ బర్త్ డే పార్టీ దాని వెనుక పొలిటికల్ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… శివప్ప మర్డి బెలగావి జిల్లా తుక్కనట్టి గ్రామానికి చెందిన శివప్ప మర్డి.. కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి ‘క్రిష్’ అని పేరు పెట్టుకున్నాడు. క్రిష్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. గ్రామంలోని దాదాపు 5 వేల మందిని పిలిచి మంచి భోజనం వడ్డించాడు. పుట్టినరోజు వేడుకల్లో 100 కిలోల కేక్ కట్ చేయడమే కాదు.. 300 కిలోల మటన్, పెద్ద సంఖ్యలో గుడ్లను తెప్పించాడు.
నాన్ వెజ్ ప్రియులకు నాన్ వెజ్.. వెజ్ తినే వారి కోసం ప్రత్యేకంగా కూరగాయలు తెప్పించి భోజన ఏర్పాట్లు చేశాడు. కేక్ కట్ చేసిన తర్వాత కుక్కను వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. గ్రామంలోని ప్రజలందరూ దానికి నమస్కరించారు. అయితే, క్రిష్ మీద శివప్ర మర్డికి ప్రేమ ఉన్నా.. పార్టీ వెనుక మాత్రం చిన్న పొలిటికల్ టచ్ కూడా ఉంది. అదేంటి అంటే.. శివప్ప మర్డి గత 20 ఏళ్లుగా గ్రామపంచాయతీ సభ్యుడిగా ఉన్నారు. ఓసారి కొత్త పంచాయతీ సభ్యుడు ఒకరు తన పుట్టిన రోజు పార్టీ ఇచ్చాడట.
ఆ సందర్భంగా పాత పంచాయతీ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మా హయాంలో పాత పంచాయతీ సభ్యులు వచ్చి కుక్కల్లా తిన్నారని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడట. మాటలతో నొచ్చుకున్న శివప్ప మర్డి తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా నిర్వహించి, ఐదు వేల మందిని పిలిచి... భోజనాలుపెట్టి ఔరా అనిపించారు. మొత్తంగా ఈ న్యూస్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
