Asianet News TeluguAsianet News Telugu

యూపీలో మరో నిర్భయ ఘటన: ఎస్సై పరీక్ష రాసివస్తుండగా... కదులుతున్న కారులోనే యువతిపై అత్యాచారం

దేశ రాజధాని న్యూడిల్లీలో జరిగిన నిర్భయ తరహా దారుణమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పరీక్ష రాసి ఇంటికి వెళుతున్న యువతిపై కదులుతున్న కారులో దుండగుడు  అత్యాచారానికి పాల్పడ్డాడు. 

uttar pradesh crime... Social media friend rapes young girl in moving car
Author
Uttar Pradesh, First Published Nov 26, 2021, 8:55 AM IST

న్యూడిల్లీ: దేశ రాజధాని న్యూడిల్లీలో నిర్భయ ఘటన మాదిరిగానే ఉత్తరప్రదేశ్ లో మరో దారుణం వెలుగుచూసింది. ఎస్సై పరీక్ష రాసి వస్తున్న యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్న దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కదులుతున్న కారులోనే యువతిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. uttar pradesh state రాష్ట్రంలోని మథురకు చెందిన 21ఏళ్ల యువతి పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యూపీ ప్రభుత్వం ఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తు చేసుకుంది. నియామక ప్రక్రియలో భాగంగా గత మంగళవారం రాతపరీక్షకు హాజరయ్యింది. ఆగ్రాలో పరీక్షా కేంద్రం వుండటంతో ఒంటరిగానే వెళ్లింది. 

పరీక్ష రాసి తిరిగివస్తున్న క్రమంలో యువతికి సోషల్ మీడియా స్నేహితుడు తేజ్ వీర్ తారసపడ్డాడు. తన కారులో ఇంటికి దింపుతానని అతడు కోరడంతో నమ్మిన యువతి కారెక్కింది. అయితే అప్పటికే కారులో తేజ్ వీర్ తో పాటు దిగంబర్ అనే మరో యువకుడు వున్నాడు. 

READ MORE  అత్యాచారం చేసిన వ్యక్తితో బాధితురాలు పెళ్లి.. వాళ్లకు ఓ బిడ్డ.. కేసు కొట్టేయాలంటూ కోర్టుకు వెళితే..

నమ్మి కారెక్కిన యువతిపై కదులుతున్న కారులోనే తేజ్ వీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దిగంబర్ కారు డ్రైవింగ్ చేస్తుండగా వెనకసీట్లో యువతిపై తేజ్ వీర్ అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యువతిని మథుర శివారులోని కోసి కలాన్‌ వద్ద వదిలి వెళ్లిపోయారు. 

ఇంటికివెళ్ళిన తర్వాత తనపై జరిగిన అఘాయిత్యం గురించి యువతి సోదరుడికి తెలిపగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత యువతి తెలిపిన వివరాల మేరకు నిందితుల ఆఛూకీ గుర్తించారు. నిందితులిద్దరూ హరియానాకు చెందినవారిగా గుర్తించారు.

అయితే పోలీసుల గాలింపు విషయం తెలిసి ఇద్దరు నిందితులు పరారయ్యారు. అయితే ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలించి గురువారం ప్రధాన నిందితుడు తేజ్ వీర్ ను అరెస్ట్ చేసారు. ఈ కేసులో మరో నిందితుడు దిగంబర్‌ పరారీలో ఉన్నాడని మథుర రూరల్‌ ఎస్పీ శిరీష్‌ చంద్ర తెలిపారు. అతడి కోసం గాలింపుకొనసాగుతోందని తెలిపారు.

READ MORE కారులో యువతిపై ముగ్గురు ఐటీ ఉద్యోగల అత్యాచారయత్నం.. పీకలదాకా తాగి.. తోటి ఉద్యోగిపైనే.. 

ఈ అత్యాచార ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి యువతికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే యువతి వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు తెలిపారు. అత్యాచారం కోసం నిందితులు ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.  

ఇక తమిళనాడులోని చెన్నై నగరంలో బుధవారం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తెల్లవారుజామున కారులో ఓ యువతిపై ఐటీ సంస్థ ఉద్యోగులు ముగ్గురు అత్యాయచారయత్నానికి  పాల్పడ్డారు. వేగంగా వెళుతున్న కారులో యువతిపై అఘాయిత్యానికి యత్నించారు. ఆమె వారిని అడ్డుకుంటూ బిగ్గరగా కేకలు పెట్టడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు అడ్డుకుని ఆమెను కాపాడారు. నుంగంబాక్కం నెల్సన్ మాణిక్కం రోడ్డులో శ్రీలంక రాయబార కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios