Asianet News TeluguAsianet News Telugu

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరోసారి కోర్టు నుంచి సమన్లు.. ఈ సారి అమిత్ షా పై వ్యాఖ్యలు చేసినందుకు..!

రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు పంపింది. అమిత్ షా పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని 2018లో ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో లాసూట్ ఫైల్ అయింది. ఈ కేసులో భాగంగానే జనవరి 6వ తేదీన రాహుల్ గాంధీ కోర్టు హాజరు కావాలని శనివారం సమన్లు జారీ చేసింది.
 

Uttar Pradesh Court summons Rahul Gandhi over his objectionable comments against amit shah kms
Author
First Published Dec 16, 2023, 9:00 PM IST

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో ప్రధాని మోడీపై వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ కోర్టు తీర్పుతో ఆయన పార్లమెంటు సభ్యత్వానికి కూడా ఎసరు వచ్చింది. తాజాగా, మరో కోర్టు నుంచి ఆయనకు సమన్లు వచ్చాయి. హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకుగాను ఈ సారి సమన్లు రావడం గమనార్హం.

యూపీలోని సుల్తాన్‌పూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. జనవరి 6వ తేదీన కోర్టులో హాజరు కావాలని ఆదేశించినట్టు ఓ కౌన్సెల్ తెలిపారు. గతంలోనే ఈ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు పంపింది. శనివారం ఆయన కోర్టులో హాజరు కావాలని ఆదేశించినా.. రాహుల్ గాంధీ హాజరు కాలేదు. దీంతో శనివారం తాజాగా మరోసారి సమన్లు పంపింది.

2018 ఆగస్టు 4వ తేదీన బీజేపీ నేత విజయ్ మిశ్రా ఫైల్ చేసిన లా సూట్‌తో ఈ కేసు మొదలైంది. అమిత్ షా పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆ సూట్ ఫైల్ అయింది.

Also Read: Revanth Reddy: తెలంగాణ కోసం రాజీనామా చేసిన నళినికి సీఎం ఆఫర్.. ఆమె ఎలా స్పందించారంటే?

నవంబర్ 18వ తేదీన న్యాయమూర్తి యోగేశ్ యాదవ్ వాదనలు విని తీర్పు రిజర్వ్‌లో పెట్టారు. తదుపరి విచారణను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీకి సమన్లు పంపి డిసెంబర్ 16వ తేదీన హాజరు కావాలని ఆదేశించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios