ఉత్తరప్రదేశ్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాంటెడ్ ఉగ్రవాది కోసం ఆపరేషన్ చేపట్టింది. మీరట్‌లో పంజాబ్ పోలీసులతో కలిసి, యూపీకి చెందిన ఏటీఎస్ పోలీసులు దాడులు జరిపారు.

Also Read:మహిళల ఫోటోలు మార్ఫింగ్ చేసి లైంగిక వేధింపులు, బ్లాక్ మెయిల్: యువకుడి అరెస్ట్

ఈ ఘటనలో ఖలిస్థాన్ మూమెంట్‌కు సంబంధించి లింకులు ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తీరత్ సింగ్‌ను  అరెస్ట్ చేశారు. ఇతను ఖలిస్తాన్ మూవ్‌మెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ విషయాన్ని యూపీ పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. కాగా, గతంలో మీరట్‌లో ఉగ్రకదలికలు అప్పట్లో కలకలం సృష్టించాయి.

Also Read:ఉరుములతో కూడిన జడివాన: దెబ్బతిన్న తాజ్ మహల్

ఈ ప్రాంతంలో ప్రేరేపిత ఉగ్రవాదుల కోసం గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు జరిపింది. ఐఎస్ మాడ్యుల్స్‌ కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి కూడా. తాజాగా ఖలిస్థాన్‌కు సంబంధించిన లింకులు కూడా ఇక్కడే బయటపడటంతో కలకలం రేపుతోంది.