Asianet News TeluguAsianet News Telugu

ఉరుములతో కూడిన జడివాన: దెబ్బతిన్న తాజ్ మహల్

శుక్రవారం రాత్రి ఆగ్రా నగరాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ఈ వర్షం సృష్టించిన బీభత్సానికి ముగ్గురు మృతి చెందారు కూడా. ఈ ఉరుముల వల్ల ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కూడా దెబ్బతినిందని భారత పురావస్తు శాఖ ప్రకటించింది. 

Taj Mahal Damaged As Thunderstorm Lashes Agra City
Author
Agra, First Published May 31, 2020, 9:00 AM IST

శుక్రవారం రాత్రి ఆగ్రా నగరాన్ని ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ఈ వర్షం సృష్టించిన బీభత్సానికి ముగ్గురు మృతి చెందారు కూడా. ఈ ఉరుముల వల్ల ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కూడా దెబ్బతినిందని భారత పురావస్తు శాఖ ప్రకటించింది. 

తాజ్ మహల్ కి పాలరాయితో ఉండే రైలింగ్, సింహద్వారం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. తాజ్ మహల్ వెనుక భాగంలో ఉండే పాలరాయి రైలింగ్ లో కొంతభాగం యమునా నది వైపుగా పడగా, ఇసుకరాయి ప్రహరీ కూడా కొంతభాగం దెబ్బతిన్నట్టు గా పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. 

Taj Mahal Damaged As Thunderstorm Lashes Agra City

ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుల వల్ల తాజ్ మహల్ గతంలో కూడా స్వల్పంగా దెబ్బతిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 2018లో కూడా మే నెలలో రెండు సార్లు ఇలా పిడుగుపాటువల్ల స్వల్పంగా దెబ్బతినింది. 

Taj Mahal Damaged As Thunderstorm Lashes Agra City

ఇక శుక్రవారం రాత్రి ఆగ్రా నగరంపై విరుచుకుపడ్డ దుమారం దాదాపుగా 124 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. నగరమంతా కూడా చివురుటాకులా వణికింది. చెట్లు కూలాయి. ఇండ్లపైకప్పులు ఎగిరిపోయాయి. 

ఇకపోతే... రాగల 24 గంటలలో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైఋతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని  ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రము సంచాలకులు వెల్లడించారు. దీంతో రాగల 48 గంటలలో ఆగ్నేయ అరేబియా సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాలలో అల్పపీడనం  ఏర్పడే అవకాశం ఉందన్నారు. 

తదుపరి 48  గంటలలో ఇది ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం మరియు  దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో వాయుగుండముగా మారే అవకాశం ఉందన్నారు. దీని వలన సుమారుగా జూన్ 1 వ తేదీన కేరళలోకి నైఋతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. 

read more  వర్షసూచనతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ... భారీ నిధులతో ముందస్తు చర్యలు

ప్రస్తుతం చత్తీస్ గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిమీ ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. చత్తీస్ గఢ్ నుండి లక్షదీవులు వరకు  తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్  కర్ణాటక మరియు కేరళ  మీదుగా 0.9 కిమీల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు.

నిన్న ఆదిలాబాద్, నిర్మల్, కోమరంభీం,  నిజామాబాద్, జగిత్యాల మరియు కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios