Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్: దేశంలో 14,500 స్కూల్స్ అప్ గ్రేడ్ కు మోడీ నిర్ణయం

టీచర్స్ డేను పురస్కరించుకొని పీఎం ఎస్‌హెచ్ఆర్ యోజన కింద దేశంలోని 14,500 స్కూల్స్ ను అప్ గ్రేడ్ చేస్తున్నామని ప్రధాని మోడీ ప్రకటించారు.

upgradation of 14,500 schools across India under PMSHR Scheme :Modi
Author
First Published Sep 5, 2022, 6:54 PM IST

న్యూఢిల్లీ:  టీచర్స్ డే ను పురస్కరించుకొని పీఎం ఎస్‌హెచ్ఆర్ఐ యోజన కంద దేశంలోని 14,500 స్కూల్స్ ను అప్ గ్రేడ్ చేయనున్నట్టుగా ప్రధాని  నరేంద్ర మోడీ ప్రకటించారు. సోమవారం నాడు సాయంత్రం ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు.

 

జాతీయ విద్యా విధానం ఇటీవల కాలంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.ఎన్ఈపీ స్పూర్తితో దేశంలోని లక్షలాది మంది పీఎంఎస్హెచ్ఆర్ఐ  కింద స్కూల్స్ మరింత ప్రయోజనం పొందుతాయని ఆయన చెప్పారు.  పీఎం ఎస్ హెచ్ఆర్ఐ స్కూళ్లలో విద్యార్ధులకు ఆధునిక పరివర్తన సంపూర్ణ పద్దతిలో విద్యను అందించనున్నాయి. డిస్కవరీ ఓరియెంటెండ్ లెర్నింగ్ సెంట్రిక్ టీచింగ్ కి ప్రాధాన్యత ఇవ్వనుంది. 

పీఎం ఎస్‌హెచ్ఆర్ఐ యోజన కింద దేశంలోని 14, 500 స్కూల్స్ అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రధాని ప్రకటించారు. ఉపాధ్యాయం దినోత్సవం రోజును మోడీ ఈ ప్రకటన చేశారు. ప్రతి ఏటా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించుకోవడం ఇండియాలో ఆనవాయితీ. అలాంటి రోజున ఈ ప్రకటన చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios