Asianet News TeluguAsianet News Telugu

గత తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ‘యూపీఏ’ పేరు ‘ఇండియా’గా మారింది - విపక్షాలపై ప్రధాని మోడీ సెటైర్లు

ఇస్టిండియా కంపెనీలో కూడా ఇండియా అనే పేరు ఉందని, అంత మాత్రాన వారికి భారతదేశంపై ప్రేమ ఉన్నట్టు కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో విపక్ష పార్టీలు చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకే ఇప్పుడు తమ పేరును ‘ఇండియా’గా మార్చుకున్నాయని విమర్శించారు. 

UPA name changed to 'India' to cover up past mistakes - PM Modi satires on opposition..ISR
Author
First Published Jul 27, 2023, 2:28 PM IST

గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే విపక్షాలు తమ పేరును యూపీఏ నుంచి ఎన్డీఏగా మార్చుకున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఇండియా’ కూటమిని విమర్శించారు. రాజస్థాన్ లోని సికార్లో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. పేదలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన కుట్రలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలు తమ పేరును ‘యూపీఏ’ నుంచి ‘ఇండియా’గా మార్చుకున్నాయని అన్నారు.

భర్త అప్పు తీర్చడం లేదని భార్యపై వ్యాపారి అత్యాచారం.. అతడి సమక్షంలోనే దారుణం.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్

ప్రతిపక్షాలకు భారత్ గురించి ఆందోళన ఉంటే సర్జికల్ దాడులను ప్రశ్నించేవారా అని ప్రధాని మోడీ అన్నారు. ‘‘వాళ్లు ఇండియాగా వచ్చారు. ఈస్టిండియా కంపెనీ పేరులో కూడా భారతదేశం ఉండేది. కానీ అది భారత్ పై వారి ప్రేమను చూపించడానికి కాదు. భారతదేశాన్ని దోచుకోవడానికి’’అని ప్రధాని ప్రతిపక్షాల కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

స్మశానంలో లవ్ మ్యారేజ్.. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక.. ఎందుకంటే ?

తుక్డే-తుక్డే గ్యాంగ్ తో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై భాష ఆధారంగా దేశాన్ని విడగొట్టిందని ప్రధాని మోడీ విమర్శించారు. ‘‘అప్పుడొకసారి ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అన్నారు. ఈ దేశ ప్రజలు అప్పుడు వారిని గద్దె దింపారు. ఈ అహంకారపరులు మళ్లీ అదే తప్పు చేశారు. ఇప్పుడు యూపీఏ అంటే ఇండియా, ఇండియా అంటే యూపీఏ అంటున్నారు. ప్రజలు వారికి చరిత్రను పునరావృతం చేస్తారు’’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వారసత్వ రాజకీయాలు  అవినీతిపరులు భారతదేశాన్ని విడిచిపెట్టాలని తెలిపారు.

ఢిల్లీపై బిల్లు విషయంలోనూ ఎన్డీఏకు వైసీపీ సపోర్ట్.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామని ప్రకటించిన విజయ సాయిరెడ్డి

ఈ సందర్భంగా రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రధాని మండిపడ్డారు. యువత భవిష్యత్తుతో కాంగ్రెస్ చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. యువత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ‘‘కానీ రాజస్థాన్ లో ఏం జరుగుతోంది? రాజస్థాన్ లో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో పేపర్ లీకేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని యువత సమర్థులు. కానీ ఇక్కడి ప్రభుత్వం వారి భవిష్యత్తును నాశనం చేస్తోంది’’ అని ఆయన ఆరోపించారు. 

ఏపీలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారు.. దీని వెనక ఉన్న శక్తులెవరు - సాధినేని యామినీశర్మ

ఇదిలా ఉండగా.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించి, సికార్ లో రూ .1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు. పీఎం కిసాన్ పథకం కింద 8.5 కోట్ల మంది రైతు లబ్ధిదారులకు 14వ విడతగా రూ.17,000 కోట్లను ప్రధాని కూడా అక్కడి నుంచి ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని ప్రస్తావిస్తూ, పీఎం కిసాన్ సమృద్ధి యోజన కింద దేశ రైతులకు రూ.18,000 కోట్లు అందాయని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios