స్మశానంలో లవ్ మ్యారేజ్.. పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక.. ఎందుకంటే ?
ఓ ప్రేమ జంట వివాహం స్మశానంలో జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా ఆ ప్రేమ జంట ఒక్కటైంది. ఈ పెళ్లిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పెళ్లిళ్లు ఎక్కడ జరుగుతాయి ?. అదేం ప్రశ్నంటారా ?.. ఆ ప్రశ్న అడగడానికి ఇప్పుడు ఓ సందర్భం ఉంది లేండి. సరే.. సాధారణంగా పెళ్లిల్లు కల్యాణ మండపాల్లో లేదంటే ఇంటి ఆవరణలో లేకపోతే గుడిలోనో జరుగుతుంటాయి. బాగా ధనవంతులైతే ఏ ప్యాలెస్ లోనే, లేకపోతే పెద్ద పడవల్లో సముద్రంపైనో జరుపుకుంటారు. విమానాల్లో కూడా కొన్ని పెళ్లిళ్లు జరిగినట్టు వార్తలు చదివాం కదా.. కానీ మహారాష్ట్రలో ఓ పెళ్లి ఓ వింతగా స్మశానంలో జరిగింది. ఇలాంటి ప్రదేశంలో పెళ్లిళ్లు జరిగినట్టు ఎంత వరకు ఎక్కడ సమాచారం లేదు. పైగా ఇది ప్రేమ పెళ్లి కావడం గమనార్హం. ఇంతకీ ఎందుకు ఇలా చేశారంటే ?
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రహతా పట్టణానికి చెందిన గంగాధర్ గైక్వాడ్ దంపతులకు మయూరి అనే కూతురు ఉంది. గంగాధర్ తన కుటుంబంలో కలిసి ఎన్నో ఏళ్లుగా శ్మశాన వాటికలోనే నివసిస్తున్నాడు. ఆయన తన మాసంజోగి (కాటి కాపరి) వృత్తి చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు మయూరి కూడా అక్కడే పెరుగుతూ, రహతాలో చదువు పూర్తి చేసింది. 12వ తరగతి చదవిన తరువాత ఆమె ఉద్యోగం కోసం షిర్డీకి వెళ్లింది.
ఆమె పని చేస్తున్న సంస్థలో షిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడు కూడా ఉద్యోగం చేసేవాడు. వీరిద్దరికి పరిచయం ఏర్పడి..అది కాస్తా స్నేమంగా మారింది. ఆ స్నేహం కొంత కాలం తరువాత ప్రేమగా రూపాంతరం చెందింది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పారు. వారు కూడా వీరి ప్రేమను అంగీకరించారు. పెళ్లి చేసుకోవానికి అనుమతి ఇచ్చారు.
కాగా.. మయూరి తండ్రి తనకు జీవనాధారాన్ని ఇచ్చిన స్మశాన వాటికలోనే కూతురి పెళ్లి చేయాలని ఆమె చిన్నప్పటి నుంచి అనుకున్నాడు. ఈ విషయాన్ని మగ పెళ్లి తరుఫు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అతడి కోరికను వారు కూడా కాదనలేదు. ఇంకేముంది చకచక రహతా పట్టణంలో స్మశాన వాటిక ప్రాంగణంలోనే వివాహ వేదికకు ఏర్పాట్లు జరిగాయి. అక్కడే మనోజ్, మయూరి మెడలో తాళి కట్టారు. స్మశాన వాటిక వేదికగా, తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో ఆ ప్రేమ జంట దంపతులుగా మారారు. ఈ పెళ్లిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.