సోనియా గాంధీకి అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక.. వైద్యులు ఏం చెప్పారంటే?
సోనియా గాంధీ అస్వస్థత బారిన పడ్డారు. గురువారం ఆమె హాస్పిటల్‌లో చేరారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో ఆమె చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఆ హాస్పిటల్ ఓ ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హాస్పిటల్‌లో చేర్చారు. ఆమె జ్వరం బారిన పడ్డారని, ఆ జ్వరంతోనే సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చేరినట్టు ఆ హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వివరించింది.
ఆమె ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నదని, పలు పరీక్షలు చేస్తున్నారని ఆ ప్రకటన వివరించింది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది. సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆరుప్ బసు, ఆయన టీమ్ సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు.
సోనియా గాంధీ గురువారం హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్టు ఆ ప్రకటన తెలిపింది.
ఆమె బ్రాంకైటిస్ సమస్యతో హాస్పిటల్‌లో చేరినట్టు తెలిసింది. ఊపిరితిత్తుల్లోని శ్వాసకోశ వాహికల సమస్యనే బ్రాంకైటిస్ అంటారు.
ఈ ఏడాది ఆమె హాస్పిటల్‌లో చేరడం ఇది రెండోసారి. జనవరి నెలలో సోనియా గాంధీ ఢిల్లీ హాస్పిటల్‌లో వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చేరిన సంగతి తెలిసిందే.
జ్వరం కారణంగా మార్చి 2వ తేదీన యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సర్ గంగా రామ్ హాస్పిటల్‌లో చేరారని గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా వెల్లడించారు. చెస్ట్ మెడిసిన్ డిపార్ట్‌మెంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఆరూప్ బసు, ఆయన టీమ్ ఆమెకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆమె ఆరోగ్య స్థితిపై పరీక్షలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వివరించారు.