దిశ ఘటనను ఇంకా దేశ ప్రజలు మరవనేలేదు. ఆమె అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు పోలీసుల చేతిలో హతమయ్యారు. ప్రస్తుతం దీనిపై కూడా వివాదం నడుస్తోంది. నిందితులపై పోలీసులు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పటికీ... మృగాళ్లలో కొద్దిగా కూడా మార్పు రాకపోవడం బాధాకరం. చాలా మంది మృగాళ్లు తమ అకృత్యాలను కొనసాగిస్తునే ఉన్నారు.

తాజాగా... ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఒకే రోజూ ముగ్గురు బాలికల పట్ల మానవ మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ రేప్ ఘటన బాధితురాలు 48గంటలపాటు చావుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన మరవకముందే అదే రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు బాలికలపై అఘాయిత్యం చోటుచేసుకుంది.

     Also read:  7వ తరగతి విద్యార్ధినిని తల్లిని చేసిన 60 ఏళ్ల వృద్ధుడు: రోజూ ఇంటికి పిలిపించుకుని...

17ఏళ్ల బాలిక పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అది కూడా బాలిక కన్న తల్లి ముందే జరగడం గమనార్హం. బాలిక తల్లి బదిర( మూగ, చెవుడు) కావడంతో... కూతురిని కాపాడుకోలేకపోయింది. కాగా... బాలిక తనపై జరిగిన దారుణాన్ని తట్టుకోలేక పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా... పోలీసులు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు.

ఈ బాలికపై అఘాయిత్యం జరిగిన కొన్ని గంటల్లోనే 14ఏళ్ల మైనర్ బాలిక స్కూల్ కి వెళ్తుండగా... 20ఏళ్ల యువకుడు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా...  బాలికను మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన యూపీలోని బిజినూర్ లో చోటుచేసుకుంది.

Also read: బాలికపై స్నేహితులతో కలిసి లవర్ గ్యాంగ్‌ రేప్, నిప్పు: బాధితురాలి మృతి

అదే రోజు బాదాన్ లో 16ఏళ్ల బాలికపై కొందరు కిడ్నాప్ చేసి బిస్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.