ఒకపక్క దిశ, ఉన్నావ్‌ ఘటనలు దేశంలో పెను దుమారాన్ని రేపుతున్నా మృగాళ్ల అకృత్యాలు ఆగడం లేదు. తాజాగా త్రిపురలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం నిప్పంటించి దారుణంగా హత్య చేశారు.

శనివారం 17 ఏళ్ల మైనర్ బాలికను బంధించిన ఆమె ప్రియుడు, అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని కొన్ని రోజుల పాటు బంధించి పలుమార్లు అత్యాచారం చేసి నిప్పంటించారు.

Also Read:కేసీఆర్ టెన్షన్: కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు లేఖ, త్వరలో మోదీతో భేటీ

శనివారం తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో చేరిన బాలిక చికిత్స పొందుతూ కన్నుమూసింది. నిందితుడి ఇంట్లో బాలిక మంటల్లో కాలిపోవడాన్ని గమనించిన ఇరుగు పొరుగువారు గమనించి మంటలను ఆర్పి ఆమెను వైద్యం కోసం జీబీ పంత్ హాస్పిటల్‌కు తరలించారు.

బాలికను ఆమె బాయ్ ఫ్రెండ్ రెండు నెలలుగా ఆ ఇంట్లో బంధించి, అత్యాచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న జనం హాస్పిటల్‌కు తరలివచ్చి నిందితులపై దాడి చేశారు. నిందితుడిని అజయ్ రుద్రపాల్ తమ కుమార్తెను తన ఇంట్లో బంధించి రూ.50 వేలు డిమాండ్ చేశాడని బాధితురాలి తల్లి తెలిపింది.

Also Read:దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తంటా: ఆ రెండు సంఘటనలపై ఆందోళనలు

అయినప్పటికీ తాము రూ. 17,000 ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం తమ బిడ్డకు నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు. బాధితురాలికి అజయ్ సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడని, దీపావళి తర్వాత ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటానని కోరాడని, తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి బంధించి స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు.