కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో ఛీటింగ్ చేసినందుకు గాను పోలీసులు 22మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ చీటింగ్ కి పాల్పడిన వారిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు మీరట్ లో అరెస్టు చేశారు.

వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు, నగదు, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వారు వివరించారు. ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా హైటెక్ కాపీ చేసినట్లు తేలింది. పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం..పరీక్ష రాస్తున్న అభ్యర్థి ప్రశ్నా పత్రాన్ని  స్కాన్ చేసి.. వాటిని బయట ఉన్నవారికి చేరవేస్తారు.

ఆ ప్రశ్నాపత్రాన్నిచూసి.. వీరు స్పై మైక్ ద్వారా సమాధానాలను వారి చేరవేస్తారు. అదుకుగాను.. ఆ అభ్యర్థి రూ.5లక్షల నగదు వారికి అందజేస్తాడు.  ఆ ముగ్గురు వ్యక్తులను ముందుగా అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి రూ.4లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ హైటెక్ కాపీతో సంబంధం ఉన్నవారందరినీ అరెస్ట్ చేశారు.

ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను 56 జిల్లాల్లో 860 సెంటర్ లలో నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. షూస్, హైహీల్స్, పూలు, నగలు పెట్టుకొని రాకూడదనే కండిషన్స్ కూడా విధించారు.