Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర భారతదేశంలో తగ్గని చలి తీవ్రత.. పొగ మంచు వల్ల ఢిల్లీలో 20 విమానాలు 42 రైళ్లు ఆలస్యం

ఉత్తర భారతదేశంలో కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. ఏ మాత్రం చలి తగ్గలేదు. చలి తీవ్రత, దట్టమైన పొగమంచు వల్ల విమానాలు, రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. 

Unrelenting cold in North India.. 20 flights and 42 trains delayed in Delhi due to smog
Author
First Published Jan 8, 2023, 12:24 PM IST

ఉత్తర భారతదేశం తీవ్రమైన చలిగాలులతో పట్టి పీడిస్తున్నాయి. దట్టమైన పొగ మంచు వ్యాపించి ఉండటం వల్ల ఢిల్లీ, చుట్టపక్కల రాష్ట్రాల్లో విమాన, రైలు కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. గడిచిన రెండేళ్లలో శనివారం ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ప్రతికూల వాతావరణం, ఇతర కార్యాచరణ సమస్యల కారణంగా దేశ రాజధానిలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 20 విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి.

ప్రపంచంలోనే సుదూరం ప్రయాణించే రివ‌ర్ క్రూయిజ్ 'గంగా విలాస్'ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ.. ప్రత్యేకతలివే

దట్టమైన పొగమంచు దేశ రాజధానిలోని అనేక ప్రాంతాలను ఆదివారం కప్పేసింది. దీని వల్ల దృశ్యమానత తగ్గిపోయింది. భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ప్రకారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 1.9 డిగ్రీలు, ఆయ నగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 2.6 డిగ్రీలు, లోధి రోడ్‌లో 2.8 డిగ్రీలు, పాలంలో 5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

కాగా.. దట్టమైన పొగమంచు, ఇతర వాతావరణ సంబంధిత సమస్యల కారణంగా రైలు కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి. పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే ప్రాంతంలో 42 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఉత్తర రైల్వే ప్రకటించింది.  ఇదిలా ఉండగా, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో నేడు, రేపు రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చలి తీవ్రత పెరగడంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఈ ఉదయం వరుసగా ఏడు, ఐదు, ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యాచారానికి పాల్పడిన యువకుడి తల్లిని గన్ తో కాల్చిన మైనర్ బాలిక.. ఢిల్లీలో ఘటన

“రాబోయే 3 రోజుల్లో తూర్పు భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలలో గణనీయమైన మార్పు  కనిపించదు. ఆ తర్వాత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది. రాబోయే 2 రోజుల పాటు మధ్యప్రదేశ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతాయి. తరువాతి మూడు రోజుల పాటు అలాంటి వాతవరణమే కొనసాగుతుంది” అని ఐఎండీ తెలిపింది.

ఉత్తర భారతంలో తీవ్రమైన చలి, ఢిల్లీ-యూపీ స‌హా పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్.. మరో 14 మంది మృతి

తదుపరి మూడు రోజులలో ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, త్రిపురలలో దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా.. ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రతీ రోజు విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. కాన్పూర్‌లో గురువారం ఒక్క రోజే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 25 మంది చనిపోయారు. వీరిలో 17 మంది వైద్య సహాయం అందక ముందే చనిపోయారు. జలుబులో ఒక్కసారిగా రక్తపోటు పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూం ప్రకారం.. గురువారం 723 మంది హృద్రోగులు ఎమర్జెన్సీ, ఓపీడీకి వచ్చారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 41 మంది రోగులను చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు హృద్రోగులు చలికి మృతి చెందారు. ఇది కాకుండా, 15 మంది రోగులు మరణించిన స్థితిలో హాస్పిటల్ కు వచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios