Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచంలోనే సుదూరం ప్రయాణించే రివ‌ర్ క్రూయిజ్ 'గంగా విలాస్'ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ.. ప్రత్యేకతలివే

Varanasi: వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్'ను ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 13న వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 50 రోజుల్లో దాదాపు 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్రూయిజ్ అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఆగి, అనేక జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా వెళుతుందని అధికారులు పేర్కొన్నారు.
 

Varanasi : PM Modi to launch world's longest river cruise 'Ganga Vilas' on January 13
Author
First Published Jan 8, 2023, 11:46 AM IST

world's longest river cruise ‘Ganga Vilas’ : ప్రపంచంలోనే అత్యంత పొడవైన సుదీర్ఘ ప్రయాణం చేసే రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్' ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (జనవరి 13) జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ఉత్తర ప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ వెల్లడించింది. ఈ క్రూయిజ్ ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్ కు ప్రయాణిస్తుంది. ఈ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ, జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, అంతర్గత జలమార్గాల రవాణా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

"ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరి 13న ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది యాత్ర చేసే రివ‌ర్   క్రూయిజ్ గంగా విలాస్ ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు.  ఈ క్రూయిజ్ వారణాసి నుండి బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ వరకు ప్ర‌యాణం చేస్తుంది. 50 రోజుల్లో దాదాపు 4,000 కిలో మీటర్ల దూరాన్ని ఈ క్రూయిజ్ క‌వ‌ర్ చేస్తుంది. ఈ క్రూయిజ్ అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఆగుతుంది. ప్ర‌పంచ వార‌త‌స్వ ప్ర‌దేశాలు, అనేక జాతీయ పార్కులు, అభయారణ్యాల గుండా ఈ క్రూయిజ్ ప్ర‌యాణం సాగిస్తుంది" అని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

రివర్ క్రూయిజ్ 'గంగా విలాస్' కు సంబంధించిన ప్ర‌త్యేక‌త‌లు.. 

1. గంగా విలాస్ క్రూయిజ్ వారణాసి నుండి బయలుదేరి ఘాజీపూర్, బక్సర్, పాట్నా మీదుగా కోల్ కతా చేరుకుంటుంది. ఇది పక్షం రోజుల పాటు బంగ్లాదేశ్ నదులపై ప్ర‌యాణం సాగిస్తుంది. తరువాత గౌహతి మీదుగా భారతదేశానికి తిరిగి వచ్చి దిబ్రూగఢ్ చేరుకుంటుంది.

2. గంగా విలాస్ క్రూయిజ్ భారతదేశంలోని రెండు గొప్ప నదులైన గంగా, బ్రహ్మపుత్రపై ప్రయాణిస్తుంది.

3. జనవరి 13న ప్రధాని న‌రేంద్ర మోడీ వర్చువల్ గా జెండా ఊపి ఈ నౌకను ప్రారంభించనున్నారు. రవిదాస్ ఘాట్ కు ఎదురుగా ఉన్న జెట్టీ బోర్డింగ్ పాయింట్ నుండి దీనిని జెండా ఊపి ప్రారంభించనున్నారు.

4. ఈ క్రూయిజ్ 50 రోజుల్లో దాదాపు 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

5. గంగా విలాస్ త‌న ప్ర‌యాణ దారిలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలతో సహా 50 కి పైగా ముఖ్య‌ ప్రదేశాలలో ఆగుతుంది. ఇది సుందర్బన్స్ డెల్టా, కజిరంగా నేషనల్ పార్క్ సహా జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాల గుండా కూడా వెళుతుంది.

6. క్రూయిజ్ లో సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు, జిమ్, స్పా, ఓపెన్ ఎయిర్ అబ్జర్వేషన్ డెక్ వంటి అనేక ఇతర  అధునాత సౌకర్యాలు ఉంటాయి.

7. అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ట్విట్టర్లో క్రూయిజ్ కు సంబంధించిన ఇన్ఫో-వీడియోను పంచుకున్నారు: "ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ఈ ఏడాది జనవరిలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. గంగా, బ్రహ్మపుత్ర నదులపై 4,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పవిత్ర వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు ప్రయాణించనుందని పేర్కొన్నారు. 

8. జనవరి 13న జ‌రిగే గంగా విలాస్  ప్రారంభోత్సవానికి వారణాసి జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది. ఈ మేరకు వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ, జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, అంతర్గత జలమార్గాల రవాణా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios