అభిమాని పాటకు ఎగిరి గంతేసిన కమల్ (వీడియో)
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజీవ్ ఉన్నీ.. రోజు మూటలు మోసి.. నాలుగు డబ్బులు సంపాదిస్తే కానీ ఇతనికి పూట గడవదు. కానీ ఇతనిలో ఉన్న టాలెంట్ రాజీవ్‌ను ప్రశాంతంగా ఉండనీయలేదు.. పాటలు పాడటంలో.. వాటికి స్వరాలు సమకూర్చడంలోనూ ఇతనికి మంచి ఆసక్తి ఉంది. కొన్ని పాటలకు స్వరకల్పన చేసి సన్నిహితుల ముందు పాడేవాడు.. తాజాగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపంలోని ‘ఉన్నయ్ కానదు నాన్’ పాటను ఓ రేంజ్‌లో పాడాడు.
ఎంతలా అంటే ఓ అనుభవమున్న సింగర్ ఏ స్థాయిలో పడతాడో ఆస్థాయిలో.. ఈ పాటను స్నేహితులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో అది కేరళ, తమిళనాడులో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాజీవ్ ఇవాళ ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌ను కలిసి ఆయన ముందు పాడాడు.. దీనికి ఎంతో పరవశించిన యూనివర్శిల్ స్టార్ ఆ యువకుడిని అభినందించాడు.
ఇతనితో పాటు చెన్నైకి చెందిన కొందరు విద్యార్థులు కూడా కమల్‌ను కలిసి.. తాము రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహాన్ని ఆయనకు చూపించి.. దాని పనితీరును వివరించి తమకు మద్ధతు తెలపాల్సిందిగా కోరారు.
