Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కోవిడ్-19 పాజిటివ్..

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. తనకు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. 

Union Minister Jyotiraditya Scindia tested positive for Covid-19
Author
First Published Nov 9, 2022, 3:39 AM IST

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కు కోవిడ్-19 సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం వెల్లడించారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిందని, గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.

హైవేపై చెడిపోయిన బస్సు.. కాన్వాయ్ నుంచి దిగి నెట్టిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. వీడియో వైరల్

‘‘ నా కోవిడ్ రిపోర్ట్ పాజిటివ్‌గా వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారందరూ సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను ’’ అని సింధియా ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

బ్రేకింగ్ న్యూస్.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బలమైన భూకంపం.. ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు

కోర్ కమిటీ సమావేశానికి హాజరు అయ్యేందుకు ఆయన మధ్యప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా బయలుదేరి వెళ్లారు. ఇది అక్కడి నాయకుల్లో అయోమయాన్ని సృష్టించింది. కొన్ని గంటల తరువాత సింధియా నుంచి ఈ ప్రకటన వెలువడింది. అయితే అస్వస్థతకు గురికావడంతో ఆయన వెళ్లిపోయారని పార్టీ నేతలు తెలిపారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయతో పాటు సింధియా రెండు రోజుల భోపాల్ పర్యటనలో ఉన్నారు. అక్కడ రాష్ట్ర బీజేపీ యూనిట్ నెలవారీ కోర్ కమిటీ సమావేశానికి హాజరవ్వాల్సి ఉండగా.. ఆయన ఒక్క సారిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios