Asianet News TeluguAsianet News Telugu

రేపు రాజ్యసభ ముందుకు జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు

జమ్మూకశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టానున్నారు. 

Union Home minister amit shah to introduce Jammu Kashmir Reservation Bill 2019 in rajya sabha tomorrow
Author
New Delhi, First Published Aug 4, 2019, 4:34 PM IST

జమ్మూకశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టానున్నారు.

దీనికి సంబంధించి ఆదివారం అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్ధాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఐబీ చీఫ్ అర్వింద్ కుమార్, రా అధిపతి సమంత్ గోయల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గౌబా తదితరులు పాల్గొన్నారు.

అమర్‌నాథ్ యాత్ర రద్దు, కశ్మీర్‌లో బలగాల మోహరింపు తదితర పరిణామాల నేపథ్యంలో అత్యున్నత స్ధాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాల మధ్య వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజల్లో మరింత కలవరాన్ని రేపుతున్నాయి.

మరోవైపు బుధవారం సమావేశం కావాల్సి వున్న కేంద్ర మంత్రివర్గం రెండు రోజుల ముందుగా సోమవారమే భేటీకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

తెల్లజెండాలతో వచ్చి సైనికుల మృతదేహాలు తీసుకెళ్లండి: పాక్‌కు భారత్ ఆఫర్

భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నం: ఏడుగురు పాక్ సైనికులు హతం

ఐబీ సూచనల మేరకే: జమ్మూ పరిస్థితిపై కిషన్ రెడ్డి

ఏం జరుగుతోంది: అమిత్‌షాతో అజిత్ ధోవల్ భేటీ

ఢిల్లీ చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్ధులు: మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌కు..

Follow Us:
Download App:
  • android
  • ios