Asianet News TeluguAsianet News Telugu

ఐబీ సూచనల మేరకే: జమ్మూ పరిస్థితిపై కిషన్ రెడ్డి

జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఐబీ సూచనల మేరకే ఈ చర్యలు తీసుకొన్నామని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Union minister kishan reddy reacts on jammu issue
Author
Delhi, First Published Aug 4, 2019, 11:06 AM IST

న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు ముప్పు ఉందని  ఐబీ సూచన మేరకే ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో తాజా పరిస్థితిపై ఎవరూ కూడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

న్యూఢిల్లీలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లో  తెలుగు ప్రజలు సహా మరెవరి  భద్రతకు ఢోకా లేదని  కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లో 20 మంది విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారని మంత్రి చెప్పారు.

ఇవాళ మధ్యాహ్నానికి  తెలుగు విద్యార్థులు ఢిల్లీకి చేరుకొంటారని కిషన్ రెడ్గి తెలిపారు. మిగిలిన 90 మంది విద్యార్ధులు ఆదివారం నాడు ఉదయం ఢిల్లీకి చేరుకొంటారని మంత్రి స్పష్టం చేశారు. జమ్మూ నుండి విద్యార్దులు, పర్యాటకులు తమ స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మంత్రి ప్రకటించారు.

కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేసిందని  మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  మరో వైపు జమ్మూలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా అస్ట్రేలియాో పాటు కొన్ని దేశాలు తమ పౌరులను స్వదేశాలకు తిరిగి రావాలని  కోరింది.ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ కు వెళ్లకూడదని కూడ జాగ్రత్తలు చెప్పింది. ఇప్పటికే కాశ్మీర్ లో ఉన్న వారిని తమ దేశానికి రావాలని అత్యవసర సందేశాన్ని పంపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios