గత కొద్దిరోజులుగా హిందీపై జరుగుతున్న చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెరదించారు. హిందీని ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదని తేల్చి చెప్పారు. తన వ్యాఖ్యలపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను కూడా హిందీయేతర రాష్ట్రం నుంచే వచ్చానని అమిత్ షా స్పష్టం చేశారు.

మరోవైపు షా చేసిన ‘‘ఒకే దేశం-ఒకే భాష’’ వ్యాఖ్యలపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఘాటుగా స్పందించారు. హిందీ భాష అమలు దేశంలో ఎక్కడైనా సాధ్యమవుతుందేమోగానీ  దక్షిణ భారతదేశంలో కుదరదని కుండబద్ధలు కొట్టారు.

దేశమంతటా ఒకే భాష ఉండటం దేశాభివృద్ధికి మంచిదే కావొచ్చు కానీ.. మనదేశంలో ఒకే భాష లేదన్నారు. తమిళనాడు ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు హిందీని అంగీకరించరని, ఉత్తర భారతీయులు కూడా ఒకే భాష విధానాన్ని అభినందించరని రజనీకాంత్ అన్నారు. 

దేశభాషపై అగ్గిరాజేసిన అమిత్ షా : అసదుద్దీన్ ఓవైసీ ఘాటు కౌంటర్

దేశమంతా హిందీ నేర్చుకోవాల్సిందేనన్న అమిత్ షా : స్టాలిన్ వార్నింగ్