Asianet News TeluguAsianet News Telugu

మోడీ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలతో ప్రాధాన్యత

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Union Cabinet meeting starts amid special session of Parliament ksp
Author
First Published Sep 18, 2023, 6:55 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొత్త బిల్లులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఎజెండాలో పొందుపరిచినవి కాకుండా పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుందనే వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios