Union Budget 2024:ఆదాయపన్ను స్లాబులు యథాతథం, రూ. 7 లక్షల వరకు పన్ను లేదు

 రూ. 7 లక్షల వరకు  వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయ పన్ను స్లాబుల్లో  మార్పులు లేవని తేల్చి చెప్పింది.

 Union Budget 2024:No change in income tax slab announced lns

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ప్రతి ఏటా రూ. 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపును ఇస్తున్నట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.కొత్త పన్ను విధానాన్ని  కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్నట్టుగా  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
 గత ఆర్ధిక సంవత్సంరంలోనే ఇదే విధానం ఉంది.  

also read:union budget 2024:మీకు ఇల్లు లేదా, పీఎం ఆవాస్ కింద ఇళ్ల నిర్మాణానికి నిర్మలా హామీ

రూ. 7 లక్షల వరకు  ఎలాంటి పన్నులు వసూలు చేసే అవకాశం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.  కార్పోరేట్ ట్యాక్స్ ను  30 శాతం నుండి 22 శాతానికి తగ్గించినట్టుగా  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.  ఆదాయ పన్ను చెల్లింపులను సులభతరం  చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆదాయ పన్ను స్లాబులు యథాతథంగా ఉంటాయని  ప్రభుత్వం ప్రకటించింది.  ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాల్లోఎలాంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ట్యాక్స్ పేయర్ల సొమ్మును దేశాభివృద్దికి వినియోగిస్తున్నట్టుగా  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios