Asianet News TeluguAsianet News Telugu

union budget 2024:మీకు ఇల్లు లేదా, పీఎం ఆవాస్ కింద ఇళ్ల నిర్మాణానికి నిర్మలా హామీ

వచ్చే ఐదేళ్లలో  2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  ఆర్ధిక శాఖ మంత్రి  తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

Union Minister Nirmala sitharaman announces to construct  2 crore houses in next five years under PMAY Scheme lns
Author
First Published Feb 1, 2024, 11:52 AM IST


న్యూఢిల్లీ:  ఇళ్లు లేని పేదలకు  కేంద్ర ప్రభుత్వం  గుడ్ న్యూస్ చెప్పింది.  రానున్న ఐదేళ్ల కాలంలో  2 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది.  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు.  పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్టుగా  నిర్మలా సీతారామన్ చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను నిర్మించనున్నట్టుగా కేంద్ర మంత్రి  నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  

పీఎం ఆవాస్ యోజన కింద  పేదలకు ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో  కేంద్ర ప్రభుత్వం  ఈ పథకం తీసుకు వచ్చింది. దేశంలోని ప్రధాన నగరాల్లో పేదలకు  ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వనుంది.ఈ పథకం కింద  పట్టణ,  గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా బలహీన వర్గాలు,  తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు,  మధ్య-ఆదాయ వర్గాలు ఈ పథకం కింద అర్హులు.

also read:union budget 2024:బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్, మొరార్జీ రికార్డు సమం
 
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం  కింద  రూ. 18 లక్షల వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలు అర్హులు. ఈ పథకం కింద ధరఖాస్తు చేసుకోవాలంటే  దేశంలో ఏ రాష్ట్రంలో కూడ  ధరఖాస్తుదారుడికి  స్వంత ఇల్లు ఉండకూడదు.

ఈ పథకం కింద  అర్హులైన లబ్ధిదారులకు  ఇళ్ల నిర్మాణానికి  కేంద్రం ఆర్ధిక సహాయం అందిస్తుంది. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 6.5 శాతం వరకు వడ్డీ రాయితీ కూడ లభిస్తుంది.   ఇంటి మరమ్మత్తులు లేదా  ఇతర అవసరాల కోసం కూడ  మూడు శాతం వడ్డీ రాయితీని కూడ పొందవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios