2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సుమారు 160 నిమిషాలకు పైగా నిర్మల సుధీర్ఘ ప్రసంగం చేశారు.

Also Read:ఫర్నీచర్, చెప్పుల ధరలు ఆకాశంలోకి... తగ్గనున్నసెల్‌ఫోన్ ధరలు: పెరిగేవి, తగ్గేవి ఇవే

ఈ క్రమంలో ఆమెకు షుగర్ లెవల్స్ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని మంత్రి ముగించారు. మధ్యలో ఆమె షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు. నిర్మల ఇబ్బంది పడుతుండటంతో సహచర కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఆమెను గమనిస్తూనే ఉన్నారు.

శనివారం చేసిన ప్రసంగం ద్వారా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 160 నిమిషాలకు పైగా ఆమె బడ్జెట్ ప్రసంగం సాగించారు.

Also Read:కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను

నిర్మల గతంలో  2017-18లో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి తాజాగా దానిని అధిగమించారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.