Asianet News TeluguAsianet News Telugu

ఫర్నీచర్, చెప్పుల ధరలు ఆకాశంలోకి... తగ్గనున్నసెల్‌ఫోన్ ధరలు: పెరిగేవి, తగ్గేవి ఇవే

2020-21 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ అనగానే సామాన్యులు ఎక్కువగా పరిశీలించేది పన్ను రేట్లు, ఏ వస్తువులు పెరుగుతున్నాయో... వేటి ధరలు తగ్గుతున్నాయోననే.

union budget 2020 cheaper and costlier articles
Author
New Dehli, First Published Feb 1, 2020, 3:53 PM IST

2020-21 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ అనగానే సామాన్యులు ఎక్కువగా పరిశీలించేది పన్ను రేట్లు, ఏ వస్తువులు పెరుగుతున్నాయో... వేటి ధరలు తగ్గుతున్నాయోననే.

Also Read:కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను

తాజా బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఫర్నీచర్, చెప్పుల ధరలు పెరగనున్నాయి. అదే విధంగా ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి.

Also Read:కేంద్ర బడ్జెట్ 2020: ఎల్ఐసీ ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు

వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మొబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్ ఆధారిత ముడి సరకుపై కస్టమ్స్ పన్నును సైతం తగ్గించింది. 

ధరలు పెరిగే వస్తువులు:

ఫర్నీచర్‌
చెప్పులు
సిగరెట్లు
పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
కిచెన్‌లో వాడే వస్తువులు
క్లే ఐరన్‌
స్టీలు
కాపర్‌
సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
స్కిమ్డ్‌ మిల్క్‌
వాల్‌ ఫ్యాన్స్‌
టేబుల్‌వేర్

ధరలు తగ్గే వస్తువులు:

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
ఎలక్ట్రిక్‌ వాహనాలు
మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు

Follow Us:
Download App:
  • android
  • ios