రూ.90 వేల అప్పును తిరిగి ఇవ్వమన్నందుకు మేనమామను హత్య.. ఆరు ముక్కలుగా నరికి, పూడ్చిపెట్టిన మేనళ్లుడు..
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాలని కోరినందుకు ఓ యువకుడు తన మేనమామను దారుణంగా హతమార్చాడు. అనంతరం శరీరాన్ని ఆరు ముక్కలుగా నరికి, ఓ పాలిథీన్ కవర్ లో పెట్టి, నేలలో పాతిపెట్టాడు.

అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఓ వ్యాపారవేత్తను అతని మేనల్లుడు దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో పాతిపెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వాప్తంగా కలకరం రేకెత్తించింది.
మళ్లీ ఎల్ వోసీ వెంట ఉగ్రవాదుల చొరబాటు యత్నం.. తిప్పికొట్టి, ఇద్దరిని హతమార్చిన ఆర్మీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న మోహిత్ అనే యువకుడు తన మేనమామ అయిన వివేక్ (45) నుంచి కొంత కాలం కిందట రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే వివేక్ కు ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో మోహిత్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తన మేనళ్లుడు తీసుకున్న అప్పును అడిగేందుకు వివేక్ ఈ నెల 12వ తేదీన అతడి ఇంటికి బయలుదేరాడు.
అయితే అప్పు చెల్లింపు విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మేనమామ తాగే టీలో మోహిత్ నిద్రమాత్రలు కలిపాడు. ఈ విషయం తెలియని వివేక్ టీ తాగాడు. కొంత సమయం తరువాత అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో మేనళ్లుడు తన మేనమామను దారుణంగా హతమార్చాడు. శరీర భాగాలను కత్తితో ఆరుభాగాలు చేశాడు. అనంతరం వాటిని పాలిథీన్ సంచిలో వేసుకొని గోపీకృష్ణ సాగర్ డ్యామ్ సమీపంలోని ఓ గుంతలో పాతిపెట్టాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చేశాడు.
అయితే మేనళ్లుడి ఇంటికి వెళ్లిన వివేక ఎంత సేపటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అతడికి ఫోన్ చేశారు. కానీ ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. కలువలేదు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మోహిత్ పై అనుమానం వచ్చింది. అతడిపై ప్రశ్నల వర్షం కురిపించడంతో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించాడు.
స్కూల్ లో టాయిలెట్ కు వెళ్లి తిరిగి రాని 11 ఏళ్ల బాలిక.. ఏమైందో అని వెళ్లి చూస్తే షాక్..
ఆ ప్రదేశంలోకి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. అయితే మృతదేహం నుంచి వివేక్ తలను వేరు చేసినట్లు పోలీసులు గుర్తించారు. చేతికి ఉన్న ఉంగరం, తాళాలతో వల్ల మృతుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. మోహిత్ ఇంటికి వివేక్ తరచూ వచ్చి వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిపేవాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్య వెనుక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.