స్నేహితుడితో గడపాలని అర్ధాంగిపై ఒత్తిడి.. అతడి భార్యతో సరసాలాడేందుకు సిద్ధమైన భర్త.. తరువాత ఏమైందంటే ?
నోయిడాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ భర్త తన భార్యకు బలవంతంగా మద్యం తాగించాడు. తన స్నేహితుడితో గడపాలని ఒత్తిడి తెచ్చాడు. అతడు కూడా తన స్నేహితుడి భార్యతో గడిపేందుకు సిద్ధపడ్డాడు.

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను స్నేహితుడితో గడపాలని ఒత్తిడి తెచ్చాడు. స్నేహితుడి భార్యతో అతడు గడిపేందుకు సిద్ధపడ్డాడు. అయితే అతడి భార్య ఈ అసభ్యకరమైన పనికి అంగీకరించలేదు. ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ దారుణం బయటపడింది.
గతేడాది వివాహం.. కానీ ఇప్పుడే ఘోరం.. నిద్రపోయే ముందు దిండు కింద ప్రతీ రాత్రి..
బాధితురాలి ఫిర్యాదు, ‘జీ న్యూస్’ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన యువతికి మురాదాబాద్ కు చెందిన వ్యక్తితో 2022 జనవరిలో వివాహమైంది. ఆమె నోయిడాలోని సెక్టార్ 137లో ఉన్న వీఐపీ హౌసింగ్ సొసైటీలో భర్త, అత్తమామలతో కలిసి నివసిస్తోంది. అయితే పెళ్లయినప్పటి నుంచి మరింత ఆధునిక జీవనశైలికి అలవాటు పడాలని అత్తమామలు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చేవారు.
భర్త తీరు కూడా అలాగే ఉండేది. పలు సందర్భాల్లో మద్యం సేవించాలని ఆమెపై భర్త ఒత్తిడి తీసుకొచ్చేవాడు. దానిని ఆమె వ్యతిరేకిస్తున్న బలవంతంగా మద్యం తాగించేవాడు. దీంతో పాటు భార్యాభర్తల మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా ఆమెను ఒత్తిడికి గురి చేసేవాడు. కొన్ని సందర్భాల్లో ఇతర పురుషులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు.
పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. రాకెట్లతో దాడి చేసిన దుండగులు.. 24 గంటల్లో రెండో ఘటన
అయితే గత ఏడాది ఏప్రిల్ 18న సెక్టార్ 75లో నిర్వహించిన ఓ హౌస్ పార్టీకి ఈ దంపతులు వెళ్లాడు. అక్కడి ఓ ప్లాట్ లో భర్త స్నేహితుడు, అతడి భార్య ఉన్నారు. అనంతరం అక్కడ బలవంతంగా ఆమెకు మద్యం తాగించారు. తన స్నేహితుడితో గడపాలని ఒత్తిడి తెచ్చాడు. అతడు స్నేహితుడి భార్యతో గడుపుతానని చెప్పాడు. కానీ దీనిని ఆమె అంగీకరించలేదు.
స్కూల్ లో టాయిలెట్ కు వెళ్లి తిరిగి రాని 11 ఏళ్ల బాలిక.. ఏమైందో అని వెళ్లి చూస్తే షాక్..
ఈ విషయంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి జూన్ 23న ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు తాజాగా భర్త, అతడి స్నేహితుడు, స్నేహితుడి భార్యతో సహా తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా బాధితురాలు తన మామ, మరదలిపై కూడా వేర్వేరుగా కేసు పెట్టింది.