మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి మధ్యాహ్నం కాంగ్రస్, ఎన్సీపీ, శివసేన ల కూటమి మహా వికాస్ అఘాది వారి బలాన్ని నిరూపరించుకోనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మధ్యాహ్నం మహారాష్ట్ర అసెంబ్లీ ఆవరణలోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి, శివాజీ మహారాజ్ పాదాలకు నమస్కరించిన అనంతరం నూతన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలోకి ప్రవేశించారు. 

మొన్న సభ్యులతో ప్రమాణ స్వీకారం చేపించేందుకు  బీజేపీ నేత కాళిదాస్ కోలాంబ్కర్ ను గవర్నర్ నియమించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాళిదాస్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేపించారు.  

Also read: మహారాష్ట్ర బలపరీక్ష: కొత్త ప్రొటెం స్పీకర్ నియామకం, ఫడ్నవీస్ విమర్శలు

జరిగిన బల నిరూపణలో శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ ల కూటమి మహా వికాస్ అఘాది తమ బలాన్ని నిరూపించుకుంది. మ్యాజిక్ ఫిగర్ 145 కన్నా ఎక్కువగా 169మంది సభ్యులు ఈ కూటమికి మద్దతు పలికారు. 

మొన్న సాయంత్రం కేబినెట్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ ని మార్చే హక్కు తమకు ఉందని అధికార మహా వికాస్ అఘాది వాదిస్తుండగా, ఆ హక్కు అధికార పక్షానికి లేదని బీజేపీ వాదిస్తోంది. 

ఈ విషయమై ప్రొటెం స్పీకర్ కి ఫడ్నవీస్ కి మధ్య కొద్దిసేపు వాదన కూడా నడిచింది. ఈ తతంగం నడుస్తుండగానే బల నిరూపణ మోషన్ ను అఘాది ముందు పెట్టింది. ఇంతవరకు చరిత్రలో ఎన్నడూ ఇలా ప్రొటెం స్పీకర్ మార్పు జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఫడ్నవీస్ తాము వాక్ అవుట్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

బీజేపీ వాక్ అవుట్ చేసిన తరువాత అసెంబ్లీలో బాల నిరూపణ నిమిత్తం ఎమ్మెల్యేల లెక్కింపు మొదలయ్యింది. ఆ తరువాత లెక్కలో 145 ఎమ్మెల్యేల మార్కు దాటడంతో మహా వికాస్ అఘాది బలాన్ని నిరూపించుకుందని ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సే ప్రకటించాడు. 

అసెంబ్లీలో లేదా శాసన మండలిలో ఎమ్మెల్యేగా గానీ, లేదా ఎమ్మెల్సీగా గానీ సభ్యత్వ పదవులు చేపట్టకుండా నేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారిలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఎనిమిదో వ్యక్తి. 

ఇదివరకు నేరుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వారిలో  ఏ.ఆర్‌.అంతులే, వసంత్‌దాదా పాటిల్, శివాజీరావ్‌ పాటిల్‌, శంకర్‌రావ్‌ చవాన్, శరద్‌ పవార్, సుశీల్‌కుమార్‌ షిండే, పృథ్వీరాజ్‌ చవాన్ లు మాత్రమే చేపట్టారు.  

తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఎటువంటి సభలోను సభ్యత్వం లేకుండానే ఇలా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. నియమాల ప్రకారం అసెంబ్లీలో లేదా మండలిలో ఎలాంటి సభ్యత్వ పదవులు లేని వ్యక్తి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల సమయంలోపు విధానసభ లేదా విధాన పరిషత్‌లో సభ్యుడు కావల్సి ఉంటుంది. 

Also read: ఠాక్రే కుటుంబ తొలి ముఖ్యమంత్రి పర్సనల్ లైఫ్ చాలా ఆసక్తికరం...