ఠాక్రే కుటుంబ తొలి ముఖ్యమంత్రి పర్సనల్ లైఫ్ చాలా ఆసక్తికరం...

ఠాక్రే  కుటుంబం నుండి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న మొదటి వ్యక్తి. మనోహర్ జోషి, నారాయణ్ రాణేల తరువాత శివసేన నుండి ముఖ్యమంత్రి అవుతున్న మూడవ వ్యక్తి. నేటి సాయంత్రం 6గంటలా 40 నిముషాలకు  శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 

uddhav thackeray personal life insights.. beyond a politician

అసెంబ్లీ ఎన్నికల తరువాత, రాష్ట్రంలో ఒక నెల రోజుల రాజకీయ నాటకం ముగిసిన తరువాత  శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఠాక్రే  కుటుంబం నుండి ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న మొదటి వ్యక్తి. మనోహర్ జోషి, నారాయణ్ రాణేల తరువాత శివసేన నుండి ముఖ్యమంత్రి అవుతున్న మూడవ వ్యక్తి. నేటి సాయంత్రం 6గంటలా 40 నిముషాలకు  శివాజీ పార్కులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Also read: అజిత్ "పరార్", ఆపై పీఛే ముడ్: తెర వెనక అసలేం జరిగింది..

ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్న ఠాక్రే  మొదటి ప్రాధాన్యత, సమస్యలతో సతమతమవుతున్న రైతుల సమస్యలను పరిష్కరించడం, శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెసులతో కూడి కొత్తగా ఏర్పడిన మహా వికాస్ అగాదిని అలాగే పటిష్టంగా, ఈ కూటమి విచ్చిన్నం కాకుండా చూడడం. 

జూలై 27, 1960 న ముంబైలో జన్మించిన థాకరే దివంగత శివసేన అధినేత బాల్ థాకరే కుమారుడు.  జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు.  అంతే కాకుండా, ఉద్ధవ్ ఠాక్రే  ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇతని ఫోటోలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. అనేక ప్రదర్శనలలో ప్రదర్శించబడ్డాయి. శివసేన గుర్తుగా మనకు కనిపించే పులి ఇతని కెమెరాలో బంధించిన ఛాయా చిత్రమే. 

తండ్రి స్థాపించిన ప్రముఖ మరాఠీ వార్తాపత్రిక సామ్నా కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు.  2002 లో జరిగిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఆయనకు తొలిసారి పార్టీ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.  ఆ ఎన్నికల్లో శివసేన విజయఢంకా మోగించింది. 

2003 లో ఉద్ధవ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. 2004 లో బాల్ థాకరే అతన్ని తదుపరి పార్టీ చీఫ్‌గా, తన వారసుడిగా  ప్రకటించారు.

ఆలస్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఉద్ధవ్ కు తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఎక్కువ సమయం లేకుండా పోయింది.  అతని సమర్థవంతమైన నాయకత్వంలో, శివసేన అనేక స్థానిక, రాష్ట్ర ఎన్నికలను కైవసం చేసుకుంది.

నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉద్ధవ్ ఠాక్రే, స్థానిక సంస్థలు, జిలా పరిషత్‌లతో సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నెట్‌వర్క్‌ను విస్తరించాడు. రాష్ట్రంలో శివసేన బలోపేతానికి ఇతోధిక కృషి చేసాడు. 

విదర్భ ప్రాంత రైతుల కోసం థాకరే విజయవంతంగా రుణమాఫీని ప్రకటించారు. 2007 లో సుదీర్ఘమైన కరువుకాటకాల తరువాత ఈ ప్రాంతంలోని రైతులు భారీ అప్పుల్లో ఉండడంతో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా 105, 56 సీట్లు సాధించాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిపై శివసేన పట్టుబట్టడంతో వారి కూటమి విచ్చిన్నమైంది. 

Also read: మహా రాజకీయం..శివసేన భవన్‌పై బాల్‌థాకరే, ఇందిరాగాంధీల పోస్టర్

ఎన్నికల ముందు 50-50 ఒప్పందం ఏదీ ఖరారు కాలేదని, ఫడ్నవీస్ పూర్తి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేసిన బీజేపీ సేన వాదనను తిరస్కరించింది.

తన పార్టీకి 30 సంవత్సరాలుగా బిజెపితో ఉన్న సంబంధాలను తెంచుకుని, సైద్ధాంతికంగా వేర్వేరు పార్టీలైన కాంగ్రెస్, ఎన్‌సిపిలతో చర్చలు జరిపారు.

తరువాత, కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేనల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీ కూడా నిర్ణీత సమయంలో ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో విధించబడింది. చివరకు ఠాక్రే ముఖ్యమంత్రిగా, మహా వికాస్ అగాడి కూటమికి నాయకత్వం వహిస్తారని నిర్ణయించారు.

ఏదేమైనా, నాటకీయమైన సంఘటనలలో, ఫడ్నవిస్, ఎన్సిపి నాయకుడు అజిత్ పవార్ నవంబర్ 23 న ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాష్ట్రాన్ని తీవ్ర రాజకీయ గందరగోళంలోకి నెట్టి, శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతూ అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం తో తనకు సంబంధం లేదని శరద్ పవార్ వెంటనే సంజాయిషీ ఇచ్చుకోవడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. 

శివసేన, కాంగ్రెస్, ఎన్‌సిపికి చెందిన ఎమ్మెల్యేలు బహిరంగ పరేడ్‌ నిర్వహించడం, 3 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం, ఫడ్నవీస్, పవార్ లు  రాజీనామా చేసారు. అసెంబ్లీలో  మెజారిటీని నిరూపించే సంఖ్య తమ పార్టీకి లేదని ఫడ్నవిస్ చెప్పగా, వ్యక్తిగత కారణాల వల్ల పవార్ పదవి నుంచి తప్పుకున్నట్టు చెప్పారు. \

288 మంది సభ్యుల అసెంబ్లీలో బుధవారం సాయంత్రం 5 గంటల లోపు మెజారిటీని నిరూపించాలని సుప్రీంకోర్టు ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు.మంగళవారం, నాడు మూడు పార్టీల కూటమికి నాయకుడిగా ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

Also read: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన పదవుల పంపకం: ఎన్సీపికి డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కి....

శివసేన చీఫ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి.

ఉద్ధవ్ రష్మీ ఠాక్రేను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆదిత్య, తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఫోటోగ్రఫీలో ఇతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఏరియల్ ఫోటోగ్రఫీ అంటే మక్కువ ఎక్కువ. 

ఉద్ధవ్ ఠాక్రే కెమెరా లో బంధించిన అద్భుతమైన ఫొటోలతో ఒక ఫోటో బుక్ ను విడుదల చేసారు. మహారాష్ట్ర దేశ అని 2010లో ఇది ప్రచురితమైనది.  ఉత్కంఠభరితమైన వైమానిక షాట్లతో( ఏరియల్ షాట్స్) తో నిండి ఉంది.  మహారాష్ట్ర సాంస్కృతిక సౌందర్యం, సౌరభం, చారిత్రక దృక్పథం గురించి ఒక సంగ్రహావలోకనం ను ఈ ఫోటో బుక్ అందిస్తుంది.

ఠాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుండి 400 మంది రైతులను ఆహ్వానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios