యూనిఫాం సివిల్ కోడ్ అవసరాన్ని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారని ఉప రాష్ట్రపతి ధన్కర్ అన్నారు. అందుకే ఆర్టికల్ 44 ప్రకారం దేశ ప్రజలకు యూసీసీ అందించాలని పేర్కొన్నారని తెలిపారు.
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై విస్తృత చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ వ్యాఖ్యలు చేశారు. యూసీసీని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించారని పేర్కొన్నారు. ఐఐటీ గౌహతి స్నాతకోత్సవంలో ధన్కర్ మంగళవారం పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం దేశవ్యాప్తంగా తన పౌరులకు యూసీసీ అందించేందుకు ప్రయత్నించాలని స్పష్టంగా చెబుతోందని అన్నారు.
బెంగళూరులో మహిళా టెక్కీ హత్య.. హైదరాబాద్ లో నివసించే మాజీ ప్రియుడిని హత్య చేసిన పోలీసులు..
‘‘ఇది వ్యవస్థాపక పితామహుల ఆలోచనా విధానం. దీని అమలుకు సమయం ఆసన్నమైంది. అడ్డంకులు, జాప్యానికి హేతుబద్ధత ఉండదు’’ అని అన్నారు. దేశంలో యూసీసీ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ధన్కర్... దీని వల్ల భారతదేశంలో జాతీయవాదం మరింత బలంగా తయారవుతుందని అన్నారు. యూసీసీ రాజ్యాంగ నిర్మాతల ఆలోచనా విధానమని అన్నారు. యూసీసీ అమలులో మరింత జాప్యం జరిగితే మన విలువలకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. అంతర్లీనంగా ఉన్న సబ్లిమిటీని అభినందించాలని, అర్థం చేసుకోవాలని కోరారు.
యూసీసీకి వ్యతిరేకంగా వస్తున్న ప్రతిస్పందనలను చూసి తాను ఆశ్చర్యపోయానని ధన్కర్ చెప్పారు. రాజకీయ భాగస్వామ్యం దేశాన్ని, జాతీయవాదాన్ని పణంగా పెట్టకూడదని అన్నారు. దేశప్రజలు 'అమృత్ కాల్'లో ఉన్నప్పుడు ఆదేశిక సూత్రాల అమలును అడ్డుకోవడానికి, ఆలస్యం చేయడానికి ఎలాంటి ఆధారమూ, హేతుబద్ధత ఉండదని అన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో ఆలోచించాలని ఉప రాష్ట్రపతి నొక్కి చెప్పారు.
పెళ్లయిన తరువాత భార్య ఖాళీగా కూర్చోకూడదు -కర్ణాటక హైకోర్టు
యూసీసీపై జరుగుతున్న చర్చకు జూన్ 27వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టారు. భాతర రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కులపై ప్రధాని మాట్లాడుతూ.. రెండు చట్టాలతో దేశాన్ని నడపలేమని అన్నారు. ‘‘ఒకే ఇంట్లో సభ్యులకు రెండు వేర్వేరు నియమాలు ఉంటే కుటుంబం పనిచేస్తుందా? అలాంటప్పుడు దేశాన్ని ఎలా నడపాలి? మన రాజ్యాంగం కూడా మతం, కులం, మతం ప్రజలకు సమాన హక్కులను కల్పించింది' అని ప్రధాని మోడీ అన్నారు.
