గత నెలలో బెంగళూరులో జరిగిన మహిళా టెక్కీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ లో నివసించే నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు. దాదాపు నెల రోజుల పాటు పోలీసులు అతడి కోసం గాలించారు. తనతో రిలేషన్ షిప్ ను వదులుకుందనే కోపంతోనే ఆమెను హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. 

గత నెలలో జరిగిన 23 ఏళ్ల టెక్కీ ఆకాంక్ష బిద్యాసర్ హత్య కేసును బెంగళూరు పోలీసులు ఛేదించారు. ఆమెను హత్య చేసింది మాజీ ప్రియుడేనని తేల్చారు. నెల రోజులుగా పరారీలో ఉన్న నిందితుడిని ఇటీవల అరెస్టు చేశారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ క్రైమ్ మిస్టరీని తాజాగా పోలీసులు వెల్లడించారు.

పెళ్లయిన తరువాత భార్య ఖాళీగా కూర్చోకూడదు -కర్ణాటక హైకోర్టు

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల అర్పిత్, ఆకాంక్ష అనే టెక్కీ గతేడాది ఒకే కంపెనీలో పని చేసేవారు. వీరిద్దరూ బెంగళూరులో నివసించేవారు. అయితే అర్పిత్ కు ప్రమోషన్ రావడంతో హైదరాబాద్ కు మకాం మార్చాడు. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అకాంక్ష అతడిని దూరం పెట్టింది. ఈ విషయంలో అర్పిత్ ఆమెపై కోపం పెంచుకున్నాడు.

గత నెల 5వ తేదీన (జూన్ 5) ఆమెతో మాట్లాడేందుకు అర్పిత్ బెంగళూరుకు వచ్చాడు. ఆమె నగరంలో కోడిహళ్లి ఫ్లాట్ లో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తోంది. అయితే ఆ రోజు స్నేహితురాలు పని నిమిత్తం బయటకు వెళ్లింది. అదే సమయంలో అర్పిత్ ఆమె ప్లాట్ కు వెళ్లాడు. ఆమెతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో సాయంత్రం ఆమెను హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. రాత్రి స్నేహితురాలు ఇంటికి వచ్చి చూసేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

గిరిజన కూలీపై బీజేపీ ఎమ్మెల్యే సహచురుడి మూత్ర విసర్జన.. ఏ పార్టీ వాడైనా వదిలిపెట్టబోనని స్పష్టం చేసిన సీఎం

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఆకాంక్షను హత్య చేసిన తర్వాత అర్పిత్ తన మొబైల్ ఫోన్, ఐడీ కార్డు, ఇతర సామాగ్రిని ఇంట్లోనే వదిలేశాడు. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు నెల రోజుల పాటు అతడి కోసం వెతుకుతూనే ఉన్నారు. అందులో భాగంగా పోలీసులు ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు కూడా వెళ్లాడు. కానీ చివరికి బెంగళూరులోనే అరెస్టు చేశారు.

ఎలా చిక్కాడంటే ?
ఆకాంక్షను హతమార్చిన తరువాత అర్పిత్ సిటీ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఢిల్లీకి టికెట్ కొన్నాడు. మరుసటి రోజు రైలు ఎక్కాడు. కానీ కొన్ని కారణాల వల్ల భోపాల్ లో దిగి బస్సు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించి అస్సాం చేరుకున్నాడు. అక్కడ ఓ హోటల్, ఇతర ప్రాంతాల్లో బస చేశాడు. అనంతరం విజయవాడకు వెళ్లాడు. అక్కడ కూడా హోటళ్లు, ఇతర ప్రదేశాల్లో నివసించాడని ఓ దర్యాప్తు అధికారి తెలిపారు.

కొన్ని దేశాలు ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారాయి - ఎస్ సీవో సదస్సులో మోడీ.. పాకిస్థాన్ పై ఫైర్..

‘‘ఆకాంక్షను హత్య చేసిన తర్వాత అర్పిత్ తన మొబైల్ ఫోన్, ఐడీ కార్డు, ఇతర సామాగ్రిని ఆమె ఇంట్లోనే వదిలేశాడు. తొలుత బెంగళూరులోని ఓ ఏటీఎం నుంచి డ్రా చేసి, నగదును ఉఫయోగించాడు. దీంతో అతడిని కార్డులను మేము బ్లాక్ చేశాం. ఇంటర్నెట్ కేఫ్ లను ఉపయోగించి పాత సహోద్యోగులు, స్నేహితులను ఆర్థిక సాయం కోసం సంప్రదించాడు. గత వారం విజయవాడలో అతడిని గుర్తించాం. కానీ మేము విజయవాడ చేరుకునేసరికి నిందితుడు వెళ్లిపోయారు. డబ్బుల కోసం స్నేహితుడిని కలిసేందుకు బెంగళూరుకు కు వచ్చాడు. దీంతో అతడిని ఇక్కడే అరెస్టు చేశాం’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు.