అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం..ఇద్దరు తెలుగువారి మృతి

two telugu devotees died in amarnath
Highlights

అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీబాయి గుండెపోటుతో మరణించగా.. ఏపీకి చెందిన రవీంథ్రనాథ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగువారు మృతి చెందారు.. బాల్తాల్ బేస్ క్యాంప్ వద్ద హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీబాయి గుండెపోటుతో మరణించగా.. ఏపీకి చెందిన రవీంథ్రనాథ్ అనే యాత్రికులు అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయనను శ్రీనగర్‌లోని స్కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారిద్దరి భౌతికకాయాన్ని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ఈ నెల 4న అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ఇద్దరు తెలుగు యాత్రికులు గుండెపోటుతో మరణించారు...

loader