Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల వేళ తనిఖీలు.. రద్దయిన పాత నోట్ల కట్టలతో పట్టుబడ్డ వ్యక్తి.. ఇంతకీ ఆ నోట్లను ఏం చేయాలని అనుకున్నాడు?

మధ్యప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు రూ. 47 లక్షల విలువైన రద్దయిన పాత నోట్లను పట్టుకెళ్లుతుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. ఆ నోట్లను తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లుతున్నారని, ఆ తాంత్రికుడి వాటిని కొత్త నోట్లుగా మారుస్తాడని చెప్పినట్టు నిందితులు వివరించారు.
 

two people caught with old currency worth of rs 47 lakhs kms
Author
First Published Oct 24, 2023, 4:11 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ విచిత్రమైన కేసు బయటికి వచ్చింది. ఎన్నికల వేళ పోలీసులు రోడ్లపై తనిఖీలు చేస్తున్నారు. నగదు రవాణాను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇలా తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై నల్ల బ్యాగ్‌ తీసుకెళ్లుతూ కనిపించారు. అనుమానంతో తనిఖీ చేయగా అందులో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అవన్నీ గతంలో కేంద్రం రద్దు చేసిన నోట్లే ఉన్నాయి. పాత రూ. 500 నోట్లు, పాత రూ. 1000 నోట్లు ఉన్నాయి. 

ఈ డబ్బును తీసుకెళ్లి ప్రజలకు పంపిణీ చేయాలనే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు అనుమానించారు. ఆ డబ్బును వెంటనే సీజ్ చేశారు. లెక్కించగా అవి రూ. 47 లక్షల విలువైన రద్దయిన నోట్లని తేలింది. పోలీసులు వెంటనే ఎన్నికల అధికారులకు, ఐటీ అధికారులకు సమాచారం అందించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెంటనే మోహరించారు.

మోరెనా జిల్లాలోని బరోఖర్‌కు చెందిన సుల్తాన కరోసియాగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. వారిని దర్యాప్తు చేస్తుండగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నోట్ల రద్దుకు ఆరు నెలల ముందు తనకు ఓ చెత్తకుప్పలో పెద్ద మొత్తంలో డబ్బుల కట్టలు కనిపించాయని నిందితుడు తెలిపాడు. ఆ డబ్బులను తీసుకుని ఎవరికీ తెలియకుండా ఇంట్లో రహస్యంగా దాచిపెట్టానని చెప్పాడు. అయితే, ఆ రద్దయిన నోట్లను వినియోగించకుండా పోయాయి. ఈ సందర్భంలో ఆ పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చగలిగే వ్యక్తి ఒకరు ఉన్నట్టు వారికొకరు చెప్పినట్టు వివరించారు. జిన్ సహాయంతో ఆ నోట్లను కొత్త నోట్లుగా మారుస్తాడని చెప్పారు. 

Also Read: బైక్ తో గేదెను ఢీకొట్టాడని.. 16 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన గుంపు..

ఆ తాంత్రికుడి వద్దకు పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవడానికి కరెన్సీ కట్టలను బ్లాక్ బ్యాగ్‌లో పట్టుకుని బయల్దేరారు. ఇంతలో పోలీసుల తనిఖీలో పట్టుబడినట్టు నిందితులు వివరించారు. అయితే, ఈ విషయంలో వాస్తవం ఎంతున్నదని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios