Asianet News TeluguAsianet News Telugu

బైక్ తో గేదెను ఢీకొట్టాడని.. 16 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన గుంపు..

అనుకోకుండా ఓ బైక్ గేదెను ఢీకొట్టిందని ఓ గుంపు దారుణానికి ఒడిగట్టింది. బైక్ నడుపుతున్న బాలుడిని చితకబాదింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాలతో మరణించాడు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది.

A 16-year-old boy was beaten to death by a mob for hitting a buffalo with a bike..ISR
Author
First Published Oct 24, 2023, 12:55 PM IST

జార్ఖండ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలుడు బైక్ తో గేదెను ఢీకొట్టాడని ఓ గుంపు ఘోరానికి ఒడిగట్టింది. ఆ పిల్లాడిని చితకబాది హతమార్చింది. దీంతో బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించారు. పోలీసులు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. 

కలుషిత రక్తం మార్పిడి.. 14 మంది చిన్నారులకు హెపటైటిస్ బీ,సీ, హెచ్ఐవీ పాజిటివ్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్కా జిల్లా సంతాలిలోని కుర్మహత్ కు చెందిన బాలుడు ఆదివారం సాయంత్రం ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. అనంతరం తన ముగ్గురు స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో హన్సిదిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాథీ గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలుడి బైక్ అనుకోకుండా  గేదెల గుంపులోని గేదెను ఢీకొట్టింది.

కొద్దిసేపటికే గేదెల మంద వెంట వచ్చిన గుంపునకు, ఈ బాలురకు మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. ఆ బాలుడు గేదె యజమానికి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా అంగీకరించాడు. కానీ ఆ గుంపు వినిపించుకోలేదు. ఆ గంపులోని నలుగురు వ్యక్తులు ఆ బాలుడిని చితకబాదారు. దీంతో ఆ బాలుడి వెంట ఉన్న స్నేహితులందరూ అక్కడి నుంచి పారిపోయారు.

దుర్గా పూజలో అపశ్రుతి.. మండపంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి..

ఆ గంపు దాడితో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి బాలుడిని సరైయత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సమీపంలోని రహదారిని దిగ్బంధించారు. 

విషాదం.. రిటైర్డ్ ఏసీపీ ప్రదీప్ టెంకర్ ఆత్మహత్య..

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనాకారులకు నచ్చజెప్పారు. నిందితులను రెండు జుల్లో అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios