ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ కార్తే పర్వాన్ గురుద్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. ఈ దాడిని విదేశాంగ మంత్రి జై శంకర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా ఖండించారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నగరంలోని ప్రసిద్ధ కార్తే పర్వాన్ గురుద్వారాలో శనివారం ఉదయం పేలుళ్లు, కాల్పులు జరిగాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వారాపైకి చొరబడ్డి కాల్పులు జరిపారు. దీంతో ఒక సిక్కు భక్తుడు, మరో వ్యక్తి మరణించారు. అయితే దాడిని భారత్ ఖండించింది. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది.
ఈ ఘటనకు సంబంధించి స్థానిక మీడియా టోలో షేర్ చేసిన వీడియోలో కార్తే పర్వాన్ ప్రాంతం నుండి భారీ బూడిద పొగలు ఎగిసిపడటం కనిపిస్తోంది. ‘‘ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు కార్ట్-ఎ-పర్వాన్ పరిసరాల్లో భారీ పేలుడు వినిపించింది. మొదటి పేలుడు జరిగిన అరగంట తర్వాత మరో పేలుడు సంభవించింది. ఆ ప్రదేశమంతా ఇప్పుడు మూసివేశారు.’’ అని చైనాకు చెందిన రన్ జిన్హువా వార్తా సంస్థతో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ప్రాణనష్టం జరుగుతుందనే భయం ఉందని, భద్రతా బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయని ఆయన చెప్పారు.
Agnipath : సైనికులకు మనశ్శాంతి, ఉద్యోగ భద్రత ముఖ్యం - ఆప్ నేత రాఘవ్ చద్దా..
ఈ దాడి జరిగినప్పుడు 25-30 మంది భక్తులు ఉదయం ప్రార్థనల కోసం గురుద్వారాలో ఉన్నారు. దుండగులు కాల్పులు జరపడం ప్రారంభించిన వెంటనే కొంత మంది వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ దాడిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, తాజా పరిణామాలపై మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది. ‘‘ఆ నగరంలోని పవిత్ర గురుద్వారాపై దాడిపై కాబూల్ నుంచి వెలువడుతున్ననివేదికలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం.’’ అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దాడిని ఖండించారు. ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సమాజ సంక్షేమమని అన్నారు. ‘‘ గురుద్వారా కార్తె పర్వాన్‌పై జరిగిన పిరికిపంద దాడిని అందరూ తీవ్రంగా ఖండించాలి. దాడి వార్త అందినప్పటి నుండి మేము పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. ’’ అని ఆయన పేర్కొన్నారు. గురుద్వారా నుంచి ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారని బీజేపీ నేత మంజీందర్ సింగ్ సిర్సా వార్తా సంస్థ ANIకి తెలిపారు. కాగా ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘన్ రాజధానిలో మైనారిటీల భద్రతను నిర్ధారించడానికి తక్షణ సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. ‘‘ కాబూల్‌లోని గురుద్వారా కార్తే పర్వాన్ వద్ద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భక్తులపై కాల్పులు జరిగినట్లు వార్తలు విన్నాను, అందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను. కాబూల్‌లోని మైనారిటీల భద్రతను నిర్ధారించడానికి తక్షణ సహాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని, విదేశీ వ్యవహారాల శాఖను కోరుతున్నాను’’ అని మాన్ ట్వీట్ చేశారు.
డేటింగ్ యాప్‌తో ఆ కేరళ యువకుడు ఏం చేశాడో తెలుసా?.. షాక్ అవుతున్న నెటిజన్లు
ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్‌లో మైనారిటీగా ఉన్న సిక్కు మతం.. నిరంతరం హింసకు గురువుతోంది. ఈ మతస్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. 2020 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలోని ప్రముఖ గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి బాంబర్ దాడి చేయడంతో 25 మంది సిక్కులు మరణించారు.