ఆవిడ మా ఆవిడే: రోడ్డుపైనే తన్నుకొన్న ఇద్దరు, మూడో వ్యక్తితోమహిళ జంప్

two husbands fight on highway, woman leaves wtih third man
Highlights

 ఓ మహిళ తన భార్యే అంటూ ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైనే గంటపాటు కొట్టుకొన్నారు. ఈ ఇద్దరూ  తమ  మధ్య జరుగుతున్న గొడవను స్థానికులు  సినిమా చూసినట్టు చూసి  ఎంజాయ్ చేశారు


బెంగుళూరు: ఓ మహిళ తన భార్యే అంటూ ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైనే గంటపాటు కొట్టుకొన్నారు. ఈ ఇద్దరూ  తమ  మధ్య జరుగుతున్న గొడవను స్థానికులు  సినిమా చూసినట్టు చూసి  ఎంజాయ్ చేశారు.  ఎవరూ కూడ  వారిని విడిపించలేదు. కొందరైతే ఏకంగా వీరిద్దరూ కొట్టుకోవడాన్ని తమ సెల్‌పోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఆవిడ మా ఆవిడ అంటూ ఇద్దరూ తన్నుకొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని  నెలమంగల తాలూకా బావికెరె క్రాస్‌ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. చిక్కబిదరకల్లు నివాసి మూర్తి, సిద్ధూలు  ఒక మహిళను ఎవరికి వారే నా భార్య అంటూ వాగ్వాదానికి దిగారు.  గంటపాటు రోడ్డుపైనే  కొట్టుకొన్నారు.

రోడ్డుపై వీరిద్దరూ  ఒక మహిళ నా భార్య అంటే నా భార్య అంటూ గొడవ పెట్టుకోవడంతో  స్థానికులు సినిమా చూసీనట్టు చూశారు. వీరిద్దరి గొడవను ఆపివేయకుండా చూస్తూ ఎంజాయ్ చేశారు. మరికొందరైతే ఏకంగా ఈ గొడవలను తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో  మూర్తి అనే వ్యక్తితో నివసిస్తోంది.  ఆమెకు గతంలో రంగస్వామి అనే వ్యక్తితో 200లో వివాహమైంది. కొన్ని కారణాలతో అతడితో ఆమె 2010లో విడాకులు తీసుకొంది. ఆ తర్వాత  ఆమె రమేష్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి జీవించింది. అతను ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పనిచేసేవాడు.

ఆ తర్వాత 2015లో  ఆమె కుమార్ అనే వ్యక్తితో కొంత కాలం ఉంది. ఆరు మాసాల తర్వాత ఆమె అతడితో విడిపోయింది. 2017 నుండి  చిక్కబిదరుకల్లుకు చెందిన మూర్తితో ఉంటుంది.   అతనికి  ఇదివరకే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

గతంలో పనిచేసిన గార్మెంట్ ఫ్యాక్టరీలో  కారు డ్రైవర్ గా  ఉన్న  సిద్దరాజు అనే వ్యక్తి  కూడ ఆమెను పెళ్లి చేసుకొంటానని  ప్రతిపాదించాడు. అయితే మూర్తికి వివాహమై భార్య, పిల్లలున్నారు. తాజాగా సిద్దరాజు ప్రతిపాదన విషయమై ఆలోచించింది.

సిద్దరాజుకు ఇంకా వివాహం కాలేదు. సిద్దరాజును వివాహం చేసుకోవాలని  ఆమె భావించింది. సిద్దరాజు ప్రతిపాదనకు ఒకే చెప్పింది.  దీంతో  వీరిద్దరూ వివాహం చేసుకొనేందుకు  ఆలయానికి వెళ్లేందుకు బస్టాండ్ లో ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన మూర్తి .. సిద్దరాజుతో గొడవకు దిగాడు. తన భార్య అంటూ నిలదీశాడు.అయితే  వీరిద్దరూ ఆమెను తమ భార్యగా పేర్కొంటే  పోలీసుల విచారణలో మాత్రం వీరిద్దరిని తన స్నేహితులుగా మాత్రమే  ఆమె చెప్పింది.  అయితే ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకొంటావా అని పోలీసులు ఆమెను అడిగినప్పుడు ఆమె ప్రతికూలంగా స్పందించింది.  అయితే  పోలీస్ స్టేషన్ కు ఆమె స్నేహితుడుగా చెప్పుకొంటున్న మరో వ్యక్తి వచ్చాడు. అతడితో కలిసి ఆమె వెళ్లిపోయింది.

loader